Begin typing your search above and press return to search.

కొత్త నేషనల్ క్రష్ - రష్మికనే డామినేట్ చేస్తోంది.

అందులో రష్మిక కన్నా త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఆమె కోసమే తెగ మాట్లాడేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:56 PM GMT
కొత్త నేషనల్ క్రష్ - రష్మికనే డామినేట్ చేస్తోంది.
X

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది యానిమల్ మూవీ. సినిమాలో హీరో రణ్ బీర్ కపూర్ ఫెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమాలో ఆయన యాక్టింగ్ తర్వాత అందరూ హీరోయిన్స కోసమే మాట్లాడుకుంటున్నారు. అందులో రష్మిక కన్నా త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఆమె కోసమే తెగ మాట్లాడేసుకుంటున్నారు.

మొన్నమొన్నటి దాకా ఆరు లక్షల ఉన్న త్రిప్తి ఫాలోవర్లు ఒక్కసారిగా మిలియన్ దాటేశారు. ఆమె హాట్ ఫొటోల కోసం సెర్చింగ్ చేసేస్తున్నారు. దీంతో ఈ హాట్ బ్యూటీ కూడా కొత్త ఫొటోలను పోస్ట్ చేసి వేడి పుట్టిస్తోంది. అయితే ఈ సినిమా ఆడిషన్లు జరిగిన టైంలో మొదటి ఛాయస్ త్రిప్తి కాదట. ముందు సారా అలీ ఖాన్ మీద టెస్ట్ షూట్ చేశారట. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సారాలో అప్పీల్ కనిపించలేదట.

దీంతో ఆమెను వద్దనుకున్నాక వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన త్రిప్తి డిమ్రి ఎంట్రీ ఇచ్చింది. సందీప్ ప్లాన్ సక్సెస్ అయింది. రణ్ బీర్ కపూర్ తో రొమాంటిక్ సీన్లలో త్రిప్తి రెచ్చిపోవడంతో ఓవర్ నైట్ స్టార్ అయింది. అయితే ఇన్నాళ్లు రష్మికను నేషనల్ క్రిష్ అన్న నెటిజన్లు.. ఇప్పుడు ఈమెనే నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఈ సినిమాలో రష్మిక కన్నా ముందు సందీప్ బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను ఆప్షన్ గా పెట్టుకున్నారట.

ఆ తర్వాత ఆలోచించి డ్రాప్ అయ్యారట. ఇంతలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో శ్రీవల్లిగా రష్మిక నటన చూసి ఫిక్స్ అయ్యారట. ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకవేళ ముందు అనుకున్నట్టు సారా, పరిణీతిలు కనక ఈ పాత్రలు పోషించి ఉంటే కచ్చితంగా ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదన్నది నిజమే. దీన్ని బట్టే సందీప్ వంగా హీరోయిన్ సెలక్షన్ చాలా స్పెషలని చెప్పొచ్చు. సినీ విశ్లేషకులు కూడా సందీప్ ఎంపికను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

సినిమాలో స్టార్ నటుడు బాబీ డియోల్ భార్యలుగా నటించిన షబానా హరూన్, షఫీనా షా, మాన్సి తక్సక్ లు కూడా హాట్ టాపిక్ గా మారిపోయారు. వీళ్ల కెరీర్ గురించి నెటిజన్లు వెతికేస్తున్నారు. రణ్ బీర్ అక్కాచెల్లెళ్లుగా నటించిన ఇద్దరు మాత్రం అంత రైట్ ఛాయస్ కాదని నెటిజన్లు అంటున్నారు. ఒక్కటే చిన్న మైనస్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫిమేల్ యాక్టర్ సెలక్షన్ లో సందీప్ తన ముందు సినిమాల్లో తన ముద్ర చూపించుకున్నారు. మరి త్వరలో ప్రభాస్ తో తీయనున్న స్ఫిరిట్ లో చూడాలి ఏం చేస్తారో.