కార్పోరేట్ ఓటీటీలకు ధీటుగా నిలుస్తారా?
మార్కెట్ లో ఓటీటీల మధ్య పోటీ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎనని ఓటీటీలున్నా కొత్త ఓటీటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి
By: Tupaki Desk | 15 July 2024 5:25 AM GMTమార్కెట్ లో ఓటీటీల మధ్య పోటీ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎనని ఓటీటీలున్నా కొత్త ఓటీటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కి ఓటీటీ కీలకం కావడంతో డిమాండ్ అలాగే ఉంది. అయితే మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలబడే వరకూ వాటిని నిలబెట్టడం అన్నది అంత వీజీ కాదు. అలా నిర్వహణభారమైన కొన్ని ఓటీటీలు ఇతర ఓటీటీల్లో విలీనం అయ్యాయి.
వాటి ద్వారా సేవల్ని అందిస్తున్నారు. నెట్ ప్లిక్స్, అమోజాన్ లాంటి కార్పోరేట్ సంస్థలతో పోటీ పడి నిలబడటం అంటే? మొదలు పెట్టిన ఈజీగా ఉండదు. కోట్లాది మంది సబ్ స్క్రైబర్లను కలిగిన సంస్థలవి. వాటిని వినూత్నంగా ప్లాన్ చేసి, చందాదారులను ఆకట్టుకునేలా ఆఫర్లు ఉంటేనే సాధ్యమవుతుంది. అది అతి కష్టం మీదనే జరుగుతోంది. ప్రేక్షకుడు ఓ సంస్తకు అలవాటు పడిన తర్వాత దాన్ని మారడం అన్నది అంత ఈజీగా జరగదు.
కొత్త వారితో పాటు, అలవాటు పడిన యూజర్లను తమవైపుకు తిప్పుకునే ప్రణాళికతో ముందుకు రావాలి. అలాగే కంటెంట్ ని క్వాలిటీతో పాటు , తక్కువ ధరకే విక్రయించగలగాలి. ఈ మధ్యనే ప్రయివేట్ ఓటీటీలకు పోటీగా ప్రభుత్వం కూడా ఓటీటీ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే ఓటీటీ స్థాపించి ముందుకెళ్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
ఉల్లు ఓటీటీ వ్యవస్థాపకుడు విభు అగర్వాల్ ఇటీవల `హరి ఓం` అనే పౌరాణిక ఓటీటీ సేవను ప్రారంభించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భక్తి, యానిమేషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ లు ప్రసారం చేస్తున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నడ చిత్రాల కోసం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రకటించారు. తాజాగా ఈ రేసులో మేఘాలయ రాష్ట్రం కూడా నిలిచింది.
`హలో మేఘాలయ` పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే వాటిని అంతే సమర్దవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. లేదంటే కార్పోరేట్ కంపెనీల పోటీని తట్టుకుని నిలబడటం అంత వీజీ కాదు.