గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ ఆ రేంజ్ లోనా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` భారీ అంచనాల మధ్య తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Dec 2024 5:44 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` భారీ అంచనాల మధ్య తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత చరణ్ నుంచి రిలీజ్ అవుతోన్న సోలో చిత్రమిది. శంకర్ సైతం సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కొంత కాలంగా ఆయనకు సరైన సక్సెస్ లు లేవు. దీంతో `గేమ్ ఛేంజర్` ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా విజయంతో కోలీవుడ్ లో గొప్ప కంబ్యాక్ అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు..లిరికల్ సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఒత్తిడి కూడా గట్టిగానే ఉంది. `దేవర`తో యంగ్ టైగర్ ఎన్టీఆర్...`పుష్ప-2` విజయంతో బన్నీ పేర్లు పాన్ ఇండియాలో మారుమ్రోగిపోతున్నాయి. ఆ తర్వాత రేసులో ఉంది చరణ్ `గేమ్ ఛేంజర్` కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చరణ్ కి ఇదో పరీక్షలా మారింది.
ఈ నేపథ్యంలో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి అందుతోంది. సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని...అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలైతే ప్రేక్షకులక కొత్త అనుభూతిని పంచుతాయని...ఆ స్టంట్స్ కోసం హాలీవుడ్ మాస్టర్లు పనిచేసిసారుట. వాటిని ప్రత్యేకంగా కొన్ని రకాల సెట్లు నిర్మించి షూట్ చేసినట్లు వినిపిస్తుంది.
`అపరిచితుడు`,` 2.0` రేంజ్ లో హోరాహోరీగా సాగే యాక్షన్ సన్నివేశాలని లీకైంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం చరణ్ ప్రత్యేకంగా విదేశీ స్టంట్ మాస్టర్ల వద్ద కొంత శిక్షణ కూడా తీసుకున్నారుట. ఆ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయన్నది మరికొంత సమాచారం అందుతోంది. యాక్షన్ సన్నివేశాలు శంకర్ కి కొట్టిన పిండి లాంటివి. ఎలాంటి హీరోతోనైనా అదిరిపోయే రేంజ్ యాక్షన్ తీయడం ఆయనకే చెల్లింది. అందులో ఎంతో క్రియేటివిటీ ఉంటుంది. దీంతో `గేమ్ ఛేంజర్` లోనూ శంకర్ మార్క్ యాక్షన్ మళ్లీ పీక్స్ లోనే ఉంటుందన్న మాట.