NYE పార్టీ.. వేర్ ఈజ్ విక్ క్యాట్?
కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం చాలా మంది స్టార్ కపుల్ విదేశీ విహారయాత్రలకు వెళ్లిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 Jan 2024 5:12 AM GMTకొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం చాలా మంది స్టార్ కపుల్ విదేశీ విహారయాత్రలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇతర జంటల్లానే ఈసారి విక్ క్యాట్ జోడీ రెండు రోజుల క్రితం న్యూ ఇయర్ వెకేషన్ కోసం ఎగ్జోటిక్ లొకేషన్ కి వెళుతూ విమానాశ్రయంలో కనిపించారు. ఇద్దరూ అప్రయత్నంగా తమ ఎయిర్‌పోర్ట్ రూపంతో ఆకర్షించారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో విక్కీ బ్రౌన్ జాకెట్ -క్యాప్‌తో కనిపించగా కత్రినా ప్యాంట్ వైట్ షర్ట్ ధరించి పొడవాటి కోటులో కనిపించింది. ఇద్దరూ స్టైలిష్‌గా కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో చేయి చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్లారు.
ఇప్పుడు రాజస్థాన్‌లో తమ వెకేషన్ నుండి కత్రిన వరుస ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో అందమైన తెల్లని పూల దుస్తులలో కత్రిన కనిపించింది. విక్కీ నలుపు రంగు పుల్ ఓవర్ స్పోర్టీ క్యాప్ తో కనిపించారు. వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో ఫోటోలో భోగి మంటల ముందు ప్రత్యక్ష రాజస్థానీ జానపద సంగీతాన్ని ఆస్వాధిస్తూ కనిపించారు. కత్రినా విక్కీ భుజంపై తన తలని ఉంచి లాలనగా చూస్తోంది. దీనికి 'రంగులరాట్నంపై' అని క్యాప్షన్ ఇచ్చింది. 2024లో ప్రతి ఒక్కరికీ మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, ప్రేమను కోరుకుంటున్నాను. ప్రేమ, కాంతి, ఆనందం.. అందరికీ 2024 శుభాకాంక్షలు!'' అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు విక్కీ.
కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ సాగించిన ఈ జంట 9 డిసెంబర్ 2021న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విలాసవంతమైన వేదికలో పెళ్లి చేసుకున్నారు. ప్రేక్షకులు ఇంకా ఈ లవ్ కపుల్ ని ఒకే చిత్రంలో చూడనప్పటికీ, సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. విక్ క్యాట్ జంట ఏదైనా ప్రేమకథా చిత్రంలో కలిసి నటించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.