ఆ హీరోయిన్ భర్త భయంతో మధ్యలోనే పరార్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ పై ప్రమాదం పొంచి ఉందా? నిక్ ని ఎవరైనా టార్గెట్ చేసారా?
By: Tupaki Desk | 16 Oct 2024 6:25 AM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ పై ప్రమాదం పొంచి ఉందా? నిక్ ని ఎవరైనా టార్గెట్ చేసారా? అందుకే షో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. పాప్ సింగర్ నిక్ జోనాస్ కి ఊహించని ఘటన ఎదురైంది. సోదరులతో కలిసి నిక్ ప్రేగ్ లో కాన్సెర్ట్ నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియనో ఓ వ్యక్తి అతడిపై లేజర్ లైట్ విసిరాడు.
దీంతో నిక్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. తనపై లేజర్ లైట్ వేసిందో? ఎవరో తెలియక ఆందోళనకు గురయ్యాడు. అక్కడ ఉంటే ప్రమాదని భావించి షో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై భద్రతా సిబ్బందికి సమాచారం అందించాడు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిక్ ఏదైనా పెద్ద ప్రమాదంలో ఉన్నాడా? అతడిని ఎవరైనా టార్గెట్ చేసారా? అని నెటి జనులు మాట్లాడుకుం టున్నారు. స్పాట్ లోనిక్ తీరును పరిశీలించిన వారంతా అతడు దేనికో భయపడుతున్నాడు? అనే అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిక్ మీద లేజర్ లైట్ విసిరిన వ్యక్తిని భద్రతా సిబ్బంది గుర్తించి అక్కడ నుంచి పంపిచారుట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి రక్షించడానికి మహరాష్ట్ర ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తోంది. మరోవైపు సల్మాన్ ప్రయివేటు సిబ్బంది అంతే శ్రమిస్తున్నారు. ఇంతలో నిక్ పై లేజర్ లైట్ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎంతైనా ఇండియా అల్లుడు కదా.