Begin typing your search above and press return to search.

భ‌ర్త‌కు జ్వ‌రం వ‌స్తే పీసీ సైలైంట్ గా ఉందేంటి?

జోనాస్ బ్ర‌ద‌ర్స్ పాప్ బోయ్ బ్యాండ్ అమెరికాలో ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   6 May 2024 2:45 AM GMT
భ‌ర్త‌కు జ్వ‌రం వ‌స్తే పీసీ సైలైంట్ గా ఉందేంటి?
X

జోనాస్ బ్ర‌ద‌ర్స్ పాప్ బోయ్ బ్యాండ్ అమెరికాలో ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల‌తో సంపాదిస్తే భ‌ర్త నిక్ జోనాస్ బ్ర‌ద‌ర్ తో క‌లిసి బ్యాండ్ వాయించి సంపాదిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా బ్ర‌ద‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో ఈవెంట్లు చేసారు. త్వ‌ర‌లో మెక్సికో ఈవెంట్ కి స‌న్న‌ధం అవుతున్నాడు. అయితే ఇంత‌లోనే నిక్ జోనాస్ అనారోగ్యం బారిన ప‌డ‌నిట్లు తెలుస్తోంది.

త‌న అరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని నిక్ ఓ వీడియోని సోష‌ల్ మీడియాలోకి వ‌దిలాడు. దీంతో పీసీ భ‌ర్త‌కి ఏమైందంటూ ఇండియా నుంచి బోలెడు కామెంట్లు వైర‌ల్ గా మారాయి. నిక్ ఆ వీడియో లో ఏం మాట్లాడాడంటే?`నేను నిక్‌ని. ఈ విషయం చెప్పాల‌నిపించ‌లేదు. కానీ పంచుకోవడం త‌ప్ప‌డం లేదు. కొన్ని రోజుల క్రితం ఏదో వింతగా అనిపించింది. రాత్రి నుండి నేను కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ నా ఆరోగ్యం అంతగా బాగాలేదు.

రోజంతా అనారోగ్యం కారణంగా మంచం మీద పడుకున్నాను. జ్వరం, చేతుల నొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు. విశ్రాంతి అవసరమని డాక్టర్ కూడా చెప్పారని వీడియోలో నిక్ అభిమానులకు తన అనారోగ్యం గురించి చెప్పాడు. ప్రమాదకరమైన ఇన్ఫ్లుఎంజా (ఎపిడెమిక్ వ్యాధి)తో బాధప డుతున్నాను. ఇప్పుడు నేను మ్యూజిక్ షోలో పాడలేను. అందుకే మెక్సికో కచేరీ తేదీని వాయిదా వేసాం.

మళ్ళీ ఆగస్టులో కాన్సర్ట్ నిర్వహిస్తామ`ని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. నిక్ జోనాస్ అభిమా నులంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. కానీ పీసీ మాత్రం భ‌ర్త ఆరోగ్యం గురించి ఎలాంటి పోస్ట్ చేయ‌లేదు. ఆలుమ‌గ‌లిద్దరు ఎంత క్లోజ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ స‌మ‌యం దొరికితే చిల‌కా-గోరింక‌ల్లా క‌లిసి కాల‌క్షేపం చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్ నుంచి ఆస్వాద‌న‌కి సంబంధించిన ఫోటోలు పంచుకుంటారు. అవి నెట్టింట అదే హాట్ టాపిక్ గా మారుతుంటాయి.