సంక్రాంతి వేళ నిధి మెరుపులా!
ఇదిగో ఇక్కడిలా డిజైనర్ ఔట్ ఫిట్ లో అగ్గిరాజేస్తుంది. షోల్డర్ లెస్ డిజైన్ లో అమ్మడి అందాలకి ఫిదా అవ్వాల్సిందే. వైట్ కలర్ లో అమ్మడి స్కిన్ టోన్ మ్యాచ్ అయిపోయింది.
By: Tupaki Desk | 15 Jan 2024 9:39 AM GMTఅందానికి అందం.. వేడెక్కించే హొయలు నిధి అగర్వాల్ సొంతం. ఆరంభంలో మడికట్టినా! అటుపై అమ్మడిలో చాలా రకాల మార్పులొచ్చిన సంగతి తెలిసిందే. గ్లామర్ వరల్డ్ లో ఎలా ఫోకస్ అవ్వాలో! టెక్నిక్ పట్టుకుని ముందుకెళ్తుంది. చిట్టిపొట్టి దుస్తుల్లో...బికినీ అందాల్లో..స్కిన్ షోతో యువతని ఎలా ఆకర్షిం చాలో! పనిగట్టుకుని షో చేస్తుంది. తాజాగా బ్యూటీ మరో వెడెక్కించే ఫోటోతో అంతర్జాలంలోకి వచ్చేసింది
ఇదిగో ఇక్కడిలా డిజైనర్ ఔట్ ఫిట్ లో అగ్గిరాజేస్తుంది. షోల్డర్ లెస్ డిజైన్ లో అమ్మడి అందాలకి ఫిదా అవ్వాల్సిందే. వైట్ కలర్ లో అమ్మడి స్కిన్ టోన్ మ్యాచ్ అయిపోయింది. జెబ్బల నుంచి చేతి మణికట్టు వరకూ ధరించిన డిజైన్ అమ్మడిని ఎంతో అందంగా హైలైట్ చేస్తుంది. చెవులకు పొడవైన రింగులు ధరిం చింది. అమ్మడు మ్యాకప్ అయిన విధానం..హెయిర్ స్టైల్ ప్రతీది నిధిని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
మొత్తంగా అమ్మడు ముస్తాబైన విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. నిధి బ్యూటీపై పడే కామెంట్ల గురించైతే ఎప్పటిలాగే చెప్పాల్సిన పనిలేదు. ఇక నిధి అగర్వాల్ కెరీర్ సంగతి చూస్తే 'హరి హర వీరమల్లు' లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మడి టాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. సక్సస్ తో పాన్ ఇండియాలో ఐడెంటిటీ దక్కుతుందని ఆశపడుతుంది.
ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ అందుకుని సిసలైన లీగ్ లో అడుగు పెట్టాలని చూస్తోంది. కానీ తానెంత తొందరప డుతున్నా ఆ ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతోన్న సంగతి తెలిసిందే. తనకన్నా వెనకొచ్చిన వారెంతో మంది లైమ్ లైట్ లోకి దూసుకుపోతున్నారు. కొత్త అవకాశాలతో బిజీ భామలుగా కనిపిస్తున్నారు. కానీ నిధి మాత్రం నత్తనకడనే సాగుతుంది. ఈ దశ నుంచి బయటకు రావాలని ఫేమస్ జ్యోతిష్యుడితో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.