స్టార్ హీరోయిన్ కి బెదిరింపులు.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు..!
లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 9 Jan 2025 10:02 AM GMTసోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ ని ఎటాక్ చేయడం చాలా ఎక్కువైంది. ముఖ్యంగా కొందరు కావాలని టార్గెట్ చేస్తూ సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వాటిపై సెలబ్రిటీస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అలాంటి వారికి తగిన శిక్ష పడేలా చేస్తున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది.
వరుస సినిమాలతో తెలుగులో అదరగొడుతున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది. నిధి అగర్వాల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఐతే ఆమెను ఒక వ్యక్తి తరచు వేధిస్తున్నాడట. అతన్ని ఎన్నిసార్లు మందలించినా సరే పద్ధతి మార్చుకోలేదట అంతేకాదు రివర్స్ లో నిధి అగర్వాల్నే చంపేస్తామని బెదిరిస్తున్నాడట. ఆమెనే కాదు ఆమె ఫ్యామిలీని కూడా చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడట.
ఐతే అతని వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్న నిధి అగర్వాల్ ఫైనల్ గా అతడి మీద సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాధుని తీసుకుని విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్నారు కదా అని సెలబ్రిటీస్ ని ఇష్టం వచ్చినట్టు వేధిస్తే మాత్రం పోలీసులు వాళ్లు చేయాల్సిన పని చేస్తారు. ఈ విషయంపై పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.
సెలబ్రిటీస్ మీద ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఐతే ఇలాంటి వారికి పోలీసులు ఎంత బుద్ధి చెప్పినా కూడా మళ్లీ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఐతే నిధి కేసుని మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారని తెలుస్తుంది.
నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇస్మార్ట్ శంకర్ తో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది. సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న నిధి రాబోతున్న సినిమాలతో తన సత్తా చాటుతుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తన సినిమాలేంటో తానేంటో అన్నట్టు ఉన్న నిధి అగర్వాల్ తనపై వేధింపులతో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది.