Begin typing your search above and press return to search.

ప్రభాస్ - పవన్ సినిమాలు.. నిద్రలేని రాత్రులు గడిపిన హాట్ బ్యూటీ

విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా వారం రోజులకు పైగానే రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 3:30 PM GMT
ప్రభాస్ - పవన్ సినిమాలు.. నిద్రలేని రాత్రులు గడిపిన హాట్ బ్యూటీ
X

టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కల్యాణ్ లనే నమ్ముకుని ఉంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. గత మూడేళ్ళుగా మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవ్వకుండా 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్' & 'ది రాజాసాబ్' సినిమాల్లోనే నటిస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ, ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఇక ఈ సినిమాలు రిలీజైన తర్వాత ఖచ్చితంగా తన కెరీర్ మలుపు తిరుగుతుందని నిధి ధీమాగా ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, పవన్ సినిమా షూటింగుల్లో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేసిందనేదనేది వివరించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా వారం రోజులకు పైగానే రెండు సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలిపింది.

''గత రెండు నెలలుగా నేను నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాను. దానికి గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. పవన్ కల్యాణ్ తో 'హరి హర వీరమల్లు', ప్రభాస్ తో 'రాజాసాబ్' సినిమాలు చేస్తున్నాను. రెండు సినిమాల చిత్రీకరణ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. ఒకే రోజు నేను రెండు షిఫ్ట్స్ షూటింగ్ లో పాల్గొన్నాను. హాఫ్ డే విజయవాడలో, హాఫ్ డే హైదరాబాద్ లో ఉన్నాను. 7 - 12 గంటల వరకూ విజయవాడలో వీరమల్లు షూటింగ్ చేసి, మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చేదాన్ని. సాయంత్రం 4-10 గంటల వరకూ రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరి, ఉదయం 4 గంటలకు విజయవాడకు చేరుకునేదాన్ని. ఎంత నిద్రపోయినా ఆ కార్లోనే. ఇదీ నా బిజీ షెడ్యూల్. అలా వారంన్నర రోజులు రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను'' అని నిధి అగర్వాల్ చెప్పింది.

''డేట్స్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో, రెండు సినిమాలను మ్యానేజ్ చేస్తూ షూటింగ్స్ చేశాను. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. నిద్ర లేకపోవడం చాలా డిఫికల్ట్ గా అనిపించేది. రెండు మూడు రోజుల తర్వాత జాంబీ మోడ్ లోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో నిజంగా నాకు అర్థం కాలేదు. అందులోనూ నేను కాఫీ కూడా తాగను. తీరిక లేకుండా పని చేస్తున్నా సరే, అలసిపోయినట్లు నాకు అనిపించేది కాదు. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని గంటల పాటు జాంబీ మోడ్ లో ఉండేదాన్ని. కానీ అది చాలా సరదాగా ఉండేది'' అని నిధి అగర్వాల్ తెలిపింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల సినిమాలలో ఒకేసారి నటించడం తన అదృష్టమని, ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడ్డానని అమ్మడు పేర్కొంది.

చివరిగా 2022లో 'హీరో' సినిమాలో కనిపించిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెర మీద కనిపించలేదు. కెరీర్ లో ఇంత గ్యాప్ రావడానికి 'హరి హర వీరమల్లు' టీమ్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కారణమనే విషయాన్ని ఆమె వెల్లడించింది. లాక్ డౌన్ కు ముందే పవన్ కల్యాణ్ సినిమాకు సైన్ చేశానని, కానీ ఈ సినిమా ప్రాసెస్ జరగడానికి మూడున్నర నుంచి నాలుగేళ్లు పట్టిందని, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే ఇతర ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదని తాను కాంట్రాక్ట్ మీద సైన్ చేశానని చెప్పింది. అందుకే ఆ సమయంలో చాలా ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం, ఎలాగైనా ఈ సినిమా వదులుకోకూడదని నిర్ణయించుకున్నానని నిధి చెప్పింది. వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి రాజాసాబ్ కు ఓకే చెప్పిందట. రాజాసాబ్, వీరమల్లు రెండూ వేటికవే భిన్నమైన సినిమాలని, 2025 తనకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నానని నిధి చెప్పుకొచ్చింది.