కొల్లగొట్టినాదిరో హుక్ స్టెప్ ఛాలెంజ్ చేసిన నిధి
ఇప్పటికే వీరమల్లు నుంచి రెండు పాటలు రిలీజవగా అందులో రీసెంట్ గా నిధి అగర్వాల్ తో ఉన్న కొల్ల గొట్టినాదిరో సాంగ్ కూడా ఒకటి.
By: Tupaki Desk | 17 March 2025 3:45 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఏఎం రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా కావడంతో వీరమల్లుకు ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.
ఇప్పటికే వీరమల్లు నుంచి రెండు పాటలు రిలీజవగా అందులో రీసెంట్ గా నిధి అగర్వాల్ తో ఉన్న కొల్ల గొట్టినాదిరో సాంగ్ కూడా ఒకటి. మెలోడీగా సాగిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. కొల్లగొట్టినాదిరో సాంగ్ లోని హుక్ స్టెప్ ను స్పెషల్ గా రిలీజ్ చేసి ఆ సాంగ్ కు రీల్స్ చేయమని ఆడియన్స్ ను కోరారు.
రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్ లో పవన్ తనదైన స్టెప్పులేసి ఆడియన్స్ ను అలరించగా, నిధి ఈ సాంగ్ లో ఎంతో రాయల్ లుక్ లో కనిపించింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ తనకు ఈ పాట చాలా బాగా నచ్చిందని, ఓ రీల్ చేసి నెటిజన్లను కూడా చేయమని ఛాలెంజ్ చేసింది. మీ డ్యాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండంటూ తను చేసిన రీల్ ను పోస్ట్ చేస్తూ కోరింది నిధి.
నిధి చేసిన ఈ ఛాలెంజ్ ను ఆడియన్స్ ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి. ఎం. ఎం కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ పాట ఇప్పటికే ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ ఎప్పటికప్పుడు షూటింగ్ లేటవుతూ వస్తుండటం వల్ల మూవీ రిలీజ్ లేటయింది. ఈ సినిమాకు ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ వచ్చాడు.