నిధి అగర్వాల్ పై హీరోలిద్దరు బరువైన బాధ్యత!
నిధి అగర్వాల్ చెప్పుకోవడానికి రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో కలిసి `హరిహర వీరమల్లు` అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తోంది.
By: Tupaki Desk | 22 March 2025 2:30 AM ISTనిధి అగర్వాల్ చెప్పుకోవడానికి రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో కలిసి `హరిహర వీరమల్లు` అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అమ్మడు బలమైన పాత్రే పోషిస్తుంది. ఈ సినిమా రిలీజ్ దాదాపు ఖాయమైనట్లే. మే 9న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో? మే 9 మాత్రం పక్కాగా వచ్చేస్తుందని అంతా నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం బాధ్యతలు నిధి అగర్వాల్ ఒంటి చేత్తో ఎత్తుకో వాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఎలాగూ పాల్గొనరు. ఆయన కేవలం రిలీజ్ కి ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే వస్తారు. పైగా ఇప్పుడు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ లో ఆ రోజు అయినా వస్తారా? రారా? అన్నది పెద్ద సందేహం. కాబట్టి ఆయన బాధ్యతలు కూడా నిధి అగర్వాల్ నెత్తిన వేసుకుని ప్రచారం చేయాల్సిందే.
ఈ విషయంలో నిధి అగర్వాల్ నిర్మాతలకు సహకరిస్తుంది. కానీ నిధి అగర్వాల్ పక్కనే పవన్ కళ్యాణ్ కూడా ఉంటే? అది ఆమెకు కలిసొస్తుంది. ఆయన కూడా నిధి అగర్వాల్ గురుంచి మైక్ పట్టుకుని రెండు ముక్కలు మాట్లాడితే? అభిమానుల్లోకి వెళ్తుంది. ఆదరణ పెరుగుతుంది. సంయుక్తా మీనన్ సహా కొంత మంది భామల విషయం లో పవన్ ఇలాంటి సహకారం గతంలో అందించిన సంగతి తెలిసిందే.
మరి ఆ అదృష్టం నిధికి ఉందో? లేదో? మరోవైపు అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ లోనూ నటిస్తోంది. ఈ సినిమా కూడా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ అది జరగలేదు. ఇంకా సెట్స్ లోనే ఉంది. రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా గురించి మాట్లాడే వేదిక దొరికనప్పుడల్లా? తనని తాను ఎలా ప్రమెట్ చేసుకోవాలో చూసుకుంటుంది.
కానీ రాజాసాబ్ ప్రచార పరంగా ప్రభాస్ ఎక్కువగా భాగమయ్యే అవకాశం తక్కువగానే ఉందంటున్నారు. ప్రీరిలీజ్ కి తప్ప మిగతా కార్యక్రమాల్లో ఆయనా భాగం కాలేరు. `పౌజీ` షూటింగ్ కూడా జరుగుతుండటంతో ఏ సమయంలో ఎక్కడ ఉంటారో తెలియదు. కాబట్టి ఈ సినిమా ప్రచారాన్ని కూడా నిధి అగర్వాల్ భుజాలపై మోయాల్సిందే.