అందాల నిధి వెయిటింగ్ ఇంకా ఎన్నాళ్లు?
నిధి అగర్వాల్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ ఆ రెండు సినిమాల విడుదల ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 10:00 PM ISTనిధి అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం కాబోతున్నా ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. కొందరు హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలో ఏడాదికి రెండు మూడు అంతకు మించి సినిమాలు చేసిన దాఖలు ఉన్నాయి. కానీ నిధి అగర్వాల్ మాత్రం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పెద్దగా ఫలితాన్ని పొందలేదు. ఆ సినిమా వల్ల వరుస ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. తెలుగులో ఈమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నిధి అగర్వాల్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ ఆ రెండు సినిమాల విడుదల ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ ముద్దుగుమ్మ 2022 లో చివరగా హీరో, కలగ తలైవన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. కానీ లక్కీగా తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో అవకాశం కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌లో వరుసగా పది సినిమా ఆఫర్లు వస్తాయని నిధి అగర్వాల్ ఆశ పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల దాదాపు మూడు ఏళ్లుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యేది క్లారిటీ లేదు. కానీ మేకర్స్ మాత్రం ఈ ఏడాదిలో విడుదల చేస్తామని అంటున్నారు. ఫ్యాన్స్ నమ్మకం లేదు దొర అంటూ మీమ్స్ చేస్తున్నారు.
వీరమల్లు సినిమా కాకుండా ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాలోనూ ఈ అందాల నిధి నటిస్తుంది. వీరమల్లు సినిమా మాదిరిగానే రాజాసాబ్ సినిమా సైతం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల ఉంటుందని అంతా అన్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అందాల నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమాపైనా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా మూడు నాలుగు పెద్ద ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో నిధి అగర్వాల్ ఉంది. కానీ ఆమె మాత్రం ఆ సినిమాలతో ఎప్పుడు వచ్చేది క్లారిటీ రావడం లేదు.
ఆ రెండు సినిమాలు అలా ఉండగా ఇటీవల ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కిందని, కానీ నిధి అగర్వాల్ అందుకు నిరాకరించిందనే వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అయితే వచ్చే ఏడాదిలో నిధి అగర్వాల్ వరుస సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు అయినా చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.