Begin typing your search above and press return to search.

బర్త్ డే బ్యూటీ నిధి డ‌బుల్ ధ‌మాకా

త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది నిధి అగ‌ర్వాల్. కానీ కొన్ని ప‌రాజ‌యాలు ఇబ్బంది పెట్టాయి

By:  Tupaki Desk   |   17 Aug 2024 2:32 PM GMT
బర్త్ డే బ్యూటీ నిధి డ‌బుల్ ధ‌మాకా
X

త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది నిధి అగ‌ర్వాల్. కానీ కొన్ని ప‌రాజ‌యాలు ఇబ్బంది పెట్టాయి. ప్ర‌స్తుతం కెరీర్ కీల‌క ద‌శ‌లో మంచి విజ‌యం కోసం వేచి చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశాలు అందుకోవ‌డం త‌న‌కు ప్ల‌స్ గా మార‌నుంద‌ని ఆశిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ మూవీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'లో అవ‌కాశం అందుకున్న ఈ బ్యూటీ .. అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ న‌టిస్తున్న 'రాజా సాబ్‌'లో ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ రెండు సినిమాలు తన కెరీర్‌ను మ‌లుపు తిప్పుతాయ‌ని ఆశిస్తోంది.

నేడు నిధి బ‌ర్త్ డే కానుక‌గా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి కొత్త లుక్ ని రిలీజైన సంగ‌తి తెలిసిందే. నిధి రాకుమారిలా క‌నిపిస్తున్న‌ క్లాసిక్ పోస్ట‌ర్ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది. తాజాగా 'రాజా సాబ్' సెట్స్ లో నిధి బ‌ర్త్ డే వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రాజా సాబ్ ద‌ర్శ‌కుడు మారుతి, ఇత‌ర చిత్ర‌బృందంతో నిధి ఎంతో ఆనందంగా క‌నిపిస్తోంది. 2024 త‌న‌కు బెస్ట్ ఫేజ్ నిస్తుంద‌ని ఈ బ్యూటీ భావిస్తోంది.

ఆశ‌ల‌న్నీ ఆ రెండిటిపైనే:

'మున్నా మైఖేల్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన‌ నిధి అగ‌ర్వాల్ తెలుగులో నాగ‌చైత‌న్య‌, అఖిల్ లాంటి స్టార్ల స‌ర‌స‌న కెరీర్‌ని ప్రారంభించింది. కానీ ఇవేవీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వేలేదు. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స‌ర‌స‌న‌ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నా ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. జయం రవి లాంటి హీరోల‌ సరసన కోలీవుడ్‌లోను న‌టించింది. కానీ అక్క‌డా ఆశించిన ఫ‌లితం రాలేదు.

కొంత‌కాలంగా పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న 'హరిహర వీరమల్లు' సినిమాతో నిధి బిజీగా ఉంది. ఇదే స‌మ‌యంలో ప్రభాస్ సరసన రాజా సాబ్‌లో అవ‌కాశం రావ‌డంతో నిధి ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత నిధి కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ పెద్ద సినిమాలివి. ఈ రెండు సినిమాల‌పైనా నిధి పెద్ద హోప్స్ పెట్టుకుంది. బ‌ర్త్ డే బ్యూటీ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త‌న‌కు విజ‌యాల్ని అందిస్తాయ‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అందాల‌ నిధికి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు.