ఇంతకీ నిధి పోస్ట్ ఏ సినిమా గురించి?
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకుంది.
By: Tupaki Desk | 2 Feb 2025 4:58 PM GMTసవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకుంది. తర్వాత హీరో సినిమాలో నటించిన నిధికి పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఎప్పుడైతే పవన్ సినిమాలో ఛాన్స్ అందుకుందో అప్పటినుంచి నిధి నుంచి ఇప్పటివరకు మరో సినిమా వచ్చింది లేదు.
హరిహర వీరమల్లులో పవన్ కు ప్రేయసిగా నిధి కనిపించనుందట. వీరమల్లు సినిమాలో యువరాణిగా ఉన్నప్పుడు యుద్ధం కూడా చేయాల్సి వచ్చిందని, ఆ పాత్ర కోసం చాలా బరువుండే చీరలు, నగలు ధరించాల్సి వచ్చేదని, షూట్ బ్రేక్ లో రెస్ట్ తీసుకోవాలన్నా వాటి వల్ల ఇబ్బందిగా ఉండేదని, వీరమల్లు కథ చాలా గొప్పగా ఉండనుందని నిధి వెల్లడించింది.
పవన్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసిన నిధికి ఆ సినిమా రిలీజవక ముందే ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో మరో ఛాన్స్ అందుకుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న హార్రర్ కామెడీలో నిధి అవకాశమందుకుంది. రాజా సాబ్ లో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఈ సినిమా తర్వాత ఆడియన్స్ తనను చూసే విధానం మారిపోతుందని చాలా నమ్మకంగా చెప్తుంది నిధి.
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ రీసెంట్ గా ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. హలో ట్విట్టర్ ఫ్యామిలీ. గత కొద్దిరోజులుగా సాంగ్ రాబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్లేనని, వాటిని నమ్మొద్దని, ప్రొడక్షన్ హౌస్ నుంచి అప్డేట్ వచ్చే వరకు ఇలాంటి వాటిని నమ్మొద్దని, ముందు మంచి రోజులు రానున్నాయని నిధి పోస్ట్ చేసింది.
నిధి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆ రెండింటిలో నిధి పోస్ట్ చేసింది ఏ సినిమా గురించని నెటిజన్లు డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గా రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ గురించి కొన్ని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిధి వాటి గురించే ఎక్స్‌లో పోస్ట్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే నిధి సినిమాల్లోకి రాకముందు అవకాశాల కోసం రెండేళ్ల పాటూ ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.