తాను చూడదు.. కానీ జనాల్ని మాత్రం భయపెడుతుందా?
హారర్ చిత్రాలంటే చాలా మందికి భయం ఉంటుంది. థియేటర్లోనే కాదు...ఫోన్ లో ఒంటరిగా చూడాలంటే భయ పడతారు.
By: Tupaki Desk | 4 Feb 2025 5:44 AM GMTహారర్ చిత్రాలంటే చాలా మందికి భయం ఉంటుంది. థియేటర్లోనే కాదు...ఫోన్ లో ఒంటరిగా చూడాలంటే భయ పడతారు. అందులోనూ రాత్రి సమయంలో? అలాంటి చిత్రాల జోలికి వెళ్లని వారు చాలా మంది ఉంటారు. పగలు కూడా అలాంటి చిత్రాలు చూసి భయపడే వారుంటారు. నిధి అగర్వాల్ కూడా అదే టైప్ అంటోంది. అమ్మడికి హారర్ చిత్రాలంటే టెర్రర్ అట. ఇప్పటి వరకూ ఒంటరిగా ఒక్క హారర్ చిత్రం కూడా చూడలేదుట.
ఎప్పటికీ ఆ ధైర్యం కూడా చేయనంటోంది. ఎందుకంత భయమంటే? చిన్నప్పటి నుంచి ఆ చిత్రాలంటో భయం నాటుకుపోయిందంది. చుట్టూ జరిగే సంఘటనలు... తాను చూసిన కొన్ని వాస్తవ సంఘటనలు తనని అలాంటి భ్రాంతికి గురి చేస్తాయని తెలిపింది. అందుకే హారర్ చిత్రాల జోలికి అస్సలు వెళ్లనంటోంది. కానీ ఇదే బ్యూటీ `ది రాజాసాబ్` లో నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కూడా హారర్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది.
ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇందులో అమ్మడు డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. చాలా కొత్తగా ఉంటుందని తెలిపింది. తనలా భయపడే వారు కచ్చితంగా కుటుంబంతో వెళ్లి సినిమా చూడాలని కోరుతుంది. అమ్మడు హారర్ సినిమాలు చూడదు. కానీ తాను నటిస్తోన్న హారర్ చిత్రాన్ని మాత్రం ఫ్యామిలీతో చూడమంటోంది. సొగసరి ఎంత స్వార్ద పరురాలు.
ఇక నిధి అగర్వాల్ బాగా ఇష్టపడి చూసిన సినిమా `సఖి`. ఆ సినిమా ఎన్నిసార్లు చూసిందో తనకే తెలియదంటోంది. అంతగా ఆ సినిమాకి కనెక్ట్ అయినట్లు తెలిపింది. అందులో మాధవన్, శాలిని మధ్య సన్నివేశాలు ఎంతో అద్భు తంగా ఉంటాయంది. ఆ సినిమా మణిరత్నం కళాఖండాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. `సఖీ` చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.