వీరమల్లు బ్యూటీ భన్సాలీ భామలా!
`హరి హర వీరమల్లు`పై నిధి అగర్వాల్ ఎలాంటి ఆశలు పెట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 17 Aug 2024 5:03 AM GMT`హరి హర వీరమల్లు`పై నిధి అగర్వాల్ ఎలాంటి ఆశలు పెట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ అత్యంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్న సమయంలో వచ్చిన అవకాశం ఇది. అందులోనూ పాన్ ఇండియా ఛాన్స్ కావడంతో? అమ్మడి ఆనందానికి అవధుల్లేవ్. ఒక్క విజయం కెరీర్ నే మార్చేస్తుందని బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది. రాజాసాబ్ చిత్రం చేతిలో ఉన్నా? పవన్ ఇమేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని భామగా కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూడకుండా? ముందుకెళ్లే గొప్ప అవకాశం ఇది.
కానీ అమ్మడికి ఆ సమయం మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. వీరమల్లు డిలే గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ డిలే అవుతుంది. ఎట్టకేలకు తాజాగా డేట్లు కేటాయించాడు. కాబట్టి నిధిలో మళ్లీ ఉత్సాహ మొదలైంది. తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా వీరమల్లు టీమ్ అమ్మడి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేసింది. ఏకంగా ప్రిన్సెస్ నే తలపించే లుక్ లో ఆద్యంత అలరిస్తుంది.
గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోతుంది. ఒళ్లంతా బంగారు మణిహారాలతో అమ్మడు ఎంతో అందంగా ఉంది. నుదిటిన పాపిడిబొట్టు నుంచి కాలి పట్టా వరకూ ప్రతీది నిధిని మరింత అందంగా తీర్చి దిద్దాయి. డ్రెస్ మ్యాచింగ్ ఆభరణాల్లో ఎంతో షైన్ అవుతుంది. అచ్చంగా నిధి అగర్వాల్ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన్ లా హైలైట్ అవుతుంది. ఇంత అందంగా హీరోయిన్లు హైలైట్ చేయడం అన్నది ఇండియన్ డైరెక్టర్లలో భన్సాలీకి మాత్రమే సాధ్యం.
చివరికి వేశ్య కథల్లో సైతం తన హీరోయిన్లను ఎంత అందంగా చూపించాడో ఇటీవల రిలీజ్ అయిన `హీరామండి: ది డైమండ్ బజార్ తో ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న నిధిలుక్ చూసి భన్సాలీ టీమ్ ముస్తాబు చేసిందా? అన్న సందేహం వచ్చేంత అందంగా నిధిని హైలైట్ చేసారు.
సినిమాలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంది. నృత్య కారిణిగా కనిపించనుంది. మూడేళ్ల క్రితం నిధి బర్త్ డే సందర్భంగానే క్రిష్ దర్శకుడిగా ఉన్నప్పుడు నృత్య కళాకారిణి లుక్ రివీల్ చేసారు. ఆ తర్వాత సినిమా ఆగిపోవడంలో ఎలాంటి అప్ డేట్ లేదు. మధ్యలో రెండు బర్త్ డేలు పూర్తయ్యాయి.
తాజాగా సినిమా మళ్లీ పట్టాలెక్కిస్తున్న నేపథ్యంలో నిధి అగర్వాల్ ఇలా కొత్త పోస్టర్ తో నెట్టింట హల్చల్ చేస్తోంది.