Begin typing your search above and press return to search.

నిధి అగ‌ర్వాల్ ఆశ‌లన్నీ ఆవిర‌వుతున్నాయా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో వీర‌మ‌ల్లుని తాత్కాలికంగా ప‌క్క‌న‌బెట్టేసారు. అవ‌స‌రం అనుకుంటే వేరే సినిమాలు చేస్తున్నారు త‌ప్ప వీర‌మ‌ల్లు జోలికి పోవ‌డం లేదు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 12:30 AM GMT
నిధి అగ‌ర్వాల్ ఆశ‌లన్నీ ఆవిర‌వుతున్నాయా?
X

'స‌వ్య‌సాచి' చిత్రంతో ఉవ్వెత్తున దూసుకొచ్చింది నిధి అగ‌ర్వాల్. అందం..అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. కానీ ఆ సినిమా ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. అటుపై రిలీజ్ అయిన 'మిస్ట‌ర్ మ‌జ్ను' కూడా మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించింది. ఈ రెండు వైఫ‌ల్యాల అనంతరం 'ఇస్మార్ట్ శంక‌ర్' తో తొలి హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ స‌క్సెస్ ఇక్క‌డ అంత బిజీ న‌టిని చేయ‌లేదు. అదే స‌మ‌యంలో కోలీవుడ్ లో ఛాన్సులు రావ‌డంతో అక్క‌డో రెండు సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత 'హీరో' రూపంలో మ‌రో ప‌రాజ‌యం ప‌ల‌క‌రించింది.

అలా నిధి కెరీర్ లో ఈ ఐదేళ్ల‌లో సాధించింది ఏదైనా ఉంది? అంటే అది పూరి సినిమాగానే చెప్పాలి. త‌ప్ప మ‌రో ర‌కంగా నిధి ఇక్క‌డ వెల‌గ‌బెట్టింది లేదు. మ‌రిప్పుడు నిధి భ‌విత‌వ్యం ఏంటి? అంటే చేతిలో ఉన్న సినిమాతో సక్సెస్ అందుకుని రేసులోకి వ‌స్తే త‌ప్ప‌! న‌టిగా బిజీ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

భారీ స‌క్సెస్ లు లేక‌పోయినా...నిధిలో కొన్ని ర‌కాల క్వాలిటీలు చూసి క్రిష్ అవ‌కాశం క‌ల్పించాడు. ఇప్పుడా ఛాన్స్ ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అమ్మ‌డు సీరియ‌స్ గానే ఉంది. సినిమాతో హిట్ అందుకుని పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వాల‌ని భావిస్తోంది. కెరీర్ ప‌రంగా కొన్ని ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు వేసుకుని సిద్దంగా ఉంది. కానీ తాను ఒక‌టి అనుకుంటే స‌న్నివేశం మ‌రోలా క‌నిపిస్తోంది. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌ది క్లారిటీ లేకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో వీర‌మ‌ల్లుని తాత్కాలికంగా ప‌క్క‌న‌బెట్టేసారు. అవ‌స‌రం అనుకుంటే వేరే సినిమాలు చేస్తున్నారు త‌ప్ప వీర‌మ‌ల్లు జోలికి పోవ‌డం లేదు. దీంతో ఈ గ్యాప్ నిధి కెరీర్ పై ప‌డుతుంద‌ని అమ్మ‌డు ఆందోళ‌న చెందుతుందిట‌. చేతిలో ఉన్న ఒక్క సినిమా ఇలా డిలే అయితే ప‌రిస్థితి ఏంటని మ‌ద‌న‌ప‌డుతోందిట‌. ఇటీవ‌లే ఫేమ‌స్ జ్యోతిష్యుడు వేణుస్వామి ని ఇంటికి పిలిపించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ పూజ‌ల త‌ర్వాత మాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయ‌ని ప్ర‌చారం సాగింది. కానీ అమ్మ‌డు ఆవిష‌యాన్ని ఇంకా ధృవీక‌రించ‌లేదు