Begin typing your search above and press return to search.

ల‌డ్డూలా ఉంది..నువ్వేం? న‌టివి అన్నారు!

ఛాలెంజ్ విస‌రడం విజీనే. కానీ దాన్ని సాధ్యం చేయ‌డం అన్న‌ది అంత వీజీ కాదు.

By:  Tupaki Desk   |   29 April 2024 1:30 AM GMT
ల‌డ్డూలా ఉంది..నువ్వేం? న‌టివి అన్నారు!
X

ఛాలెంజ్ విస‌రడం విజీనే. కానీ దాన్ని సాధ్యం చేయ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. అందులోనూ సినిమా రంగంలో ఏకంగా జీవితాన్నే త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా డేర్ చేస్తేనే ఇక్క‌డ లైఫ్ అనేది ఉంటుంది. పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డే ద‌మ్ము ఉంటుంది. అదే కాన్పిడెన్స్ తో షారుక్ ఖాన్ తోన‌టిస్తావా? అని కామెంట్ చేయ‌డంతో ఏకంగా చేస్తోన్న ఉద్యోగానికే రాజీనామా చేసి ర‌చ‌యిత‌..డైరెక్ట‌ర్ గా...షారుక్ తో తెర‌ను పంచుకున్న ప్ర‌తిభావంతురాలిగా నిల‌బ‌డింది నిధి భీష్ట్. తొలుత నిధి ఇండ‌స్ట్రీకి వెళ్తావా? అంటే నీకు ఎవ‌రు అవ‌కాశాలిస్తారు? ల‌డ్డులా ఉన్నావ్ ? గుండ్రంగా ఉండే ముఖం? అవ‌కాశాలిచ్చేది ఎవ‌ర‌ని ఎగ‌తాళి చేసారుట‌.

ఆ మాట‌లు భ‌రించ‌లేక జీవితంలో తాను అనుకున్న ల‌క్ష్యం వైపే అడుగులు వేసింది. అటుపై బ్యాంక్ లో ఉన్న ఎఫ్ డీ మొత్తాన్ని క్లోజ్ చేసి న్యూ బ్రెయిన్ థియేట‌ర్ ఓక్స్ అనే బ్యాన‌ర్ స్థాపించింది. అందులో `హూలెట్స్ ద డాగ్స్ ఔట్` అనే నాట‌కాన్నిడెరెక్ట్ చేసింది. ఆ నాట‌కం రైట‌ర్ గా...కాస్టింగ్ డైరెక్ట‌ర్ గా బాలీవుడ్ లో ఎన్నో అవ‌కాశాలు క‌ల్పించింది. వ‌చ్చిన అవ‌కాశాల‌తోనే తానేంటో నిరూపించుకుంది. `తుపాకీ`..`చాయ్ సుట్టా క్రానిక‌ల్స్`..`ప‌ర్మినెంట్ రూమ్ మేట్స్`..`టీవీఎఫ్ పీచ‌ర్స్` ..`మామ్లా లీగ‌ల్ హై` షో వంటి సీరిస్ ల‌కు కాస్టింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసింది.

అదే స‌మ‌యంలో షారుక్ ఖాన్ తో క‌లిసి `బేర్లీ స్పికింగ్ విత్ అర్న‌బ్` అనే షోకి మోడ‌రేట‌ర్ గా ప‌నిచేసింది. ఆ త‌ర్వాత త‌న పాత కంపెనీ బాస్ ని ఓ రోజు క‌లిసి చూసారా? నేను ఎలా స‌క్సెస్ అయ్యానో? ఆ రోజు మీ ముందుచేసిన ఛాలెంజ్ ని కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత చేధించాను అంటూ అత‌డి తోనే షెభాస్ అనిపించుకుంది. ప్ర‌య‌త్నాలు చేస్తోన్న క్ర‌మంలో విమ‌ర్శించిన వారు..అవ‌కాశాలు ఇవ్వం పో! అన్న వాళ్లు నేడు ఆమెని పిలిచి మ‌రీ త‌మ ప్రాజెక్ట్ ల్లో ఛాన్సులిస్తున్నారు.

అడిగిత‌నంత పారితోషికం అందిస్తున్నారు. ఇది కేవ‌లం ట్యాలెంట్ మాత్ర‌మే సాధ్య‌మ‌ని నిధి నిరూపించింది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ లో సీరియ‌స్ గా పెద్ద ప్రాజెక్ట్ లు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. స్టార్ హీరోలనే క‌లిసి క‌థ‌లు చెబుతుంది. న‌టిగా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటుంది. అవ‌కాశం వ‌స్తే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా ప‌నిచేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపింది.