Begin typing your search above and press return to search.

ఇది ఎప్పటికీ అంతం కాని యుద్ధం: నిహారిక‌

చాలా ప‌ట్టుద‌ల ఉంటేనే స‌మ‌య‌పాల‌న‌తో జిమ్ కి నిరంత‌రం హాజ‌రు కాగ‌ల‌రు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 5:11 PM GMT
ఇది ఎప్పటికీ అంతం కాని యుద్ధం: నిహారిక‌
X

ఫిట్‌నెస్ అనేది అందాన్ని కాపాడే మంత్రం మాత్రమే కాదు. బలం, పట్టుదలను నిరూపించుకునే సాధ‌నం. జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేయ‌డం అంత సులువైన ప‌నేమీ కాదు. చాలా ప‌ట్టుద‌ల ఉంటేనే స‌మ‌య‌పాల‌న‌తో జిమ్ కి నిరంత‌రం హాజ‌రు కాగ‌ల‌రు.


అయితే నిహారిక కొణిదెల శ్ర‌మ, క‌మిట్‌మెంట్ చూస్తున్న‌వారికి త‌న స‌మ‌య‌పాల‌న అవ‌గ‌త‌మ‌వుతుంది. నిహారిక జిమ్ లో క‌ఠినంగా శ్ర‌మించ‌డానికి కార‌ణం.. న‌ట‌నా రంగంలోకి కంబ్యాక్ అవ్వ‌డ‌మే. తాను అనుకున్న శిఖ‌రానికి చేర‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. నిహారిక తన తదుపరి చిత్రం `వాట్ ది ఫిష్` కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అస్తా లక్ష్మి అనే పాత్రను పోషిస్తోంది. నిహారిక పాత్ర ఆద్య‌తం ఆసక్తికరంగా సాగుతుంద‌ని స‌మాచాం.

నిహారిక ఇంత‌కుముందే ''నేను, నా ఫిట్‌నెస్... ఎప్పటికీ అంతం కాని యుద్ధం! ఎల్లప్పుడూ నన్ను ముందుకు న‌డిపిస్తున్నందుకు ధన్యవాదాలు'' అని క్యాప్ష‌న్ ఇచ్చింది నిహారిక‌. ఇదే పోస్ట్ లో ఆంటోనీ అనే పేరును ప్ర‌స్థావించింది. ఈ వీడియో వేగంగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వారు ఫిట్‌గా ఉండటానికి స్ఫూర్తి పొందుతున్నారు. జిమ్ లో నిహారిక నీలిరంగు బ్రాలెట్, షార్ట్ ధరించి, భారీ టీ-షర్ట్‌తో క‌నిపించింది. సూప‌ర్‌ ఫిట్ అని నిరూపించుకోవ‌డం ద్వారా కెరీర్ ని స‌రిదిద్దుకోవాల‌ని త‌పించ‌డం స‌రైన‌దే. అన్ని స‌వాళ్ల‌ను నెగ్గాల‌ని మెగా ప్రిన్సెస్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.