Begin typing your search above and press return to search.

మెగా డాటర్ గ్లామర్ ఫైర్.. షేక్ అంతే..!

నిర్మాతగా హిట్ అందుకున్న నిహారిక నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 6:31 AM GMT
మెగా డాటర్ గ్లామర్ ఫైర్.. షేక్ అంతే..!
X

ఓడిన చోట గెలవాలని బలంగా ఫిక్స్ అయిన మెగా డాటర్ నిహారిక మొదట కథానాయికగా ఒకటి రెండు ప్రయత్నాలు చేసి అది కుదరని పని అని పెళ్లి చేసుకుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అది కూడా సరిగా వర్క్ అవుట్ కాకపోవడంతో డైవర్స్ తీసుకుని సోలోగా ఉంటుంది. ఐతే ఈమధ్యనే కమిటీ కుర్రాళ్లు సినిమా నిర్మించి తన ఐడియాలజీ ఎంత స్ట్రాంగ్ అన్నది మరోసారి ప్రూవ్ చేసుకుంది నిహారిక. నిర్మాతగా హిట్ అందుకున్న నిహారిక నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.


అందుకే ఈసారి కోలీవుడ్ నుంచి ఆ ప్రయత్నం చేస్తుంది. తమిళ్ లో వాలి మోహన్ దాస్ డైరెక్షన్ లో షేన్ నిగం లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మద్రాస్ కారన్. ఈ సినిమాలో ఐశ్వర్య దత్ తో పాటు నిహారిక కొణిదెల ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. సినిమా నుంచి సెప్టెంబర్ లో ఒక సాంగ్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా కాదల్ సడుగుడు అంటూ రెహమాన్ రీమిక్స్ సాంగ్ రిలీజైంది. సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ ఒక లెక్క అయితే ఈ సాంగ్ లో మెగా డాటర్ నిహారిక ఇంటెన్స్ రొమాంటిక్ స్టిల్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

మెగా డాటర్ గా నిహారిక హీరోయిన్ అవుతానంటే ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే నిహారిక తెలుగులో చేసిన రెండు మూడు సినిమాలు కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చింది. ఐతే తమిళ్ లో మాత్రం నిహారిక తన అడ్డు గోడలను తొలగించింది. అక్కడ గ్లామర్ డోస్ పెంచి మరీ నటించిందని ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఐతే నిహారిక చేస్తున్న ఈ బోల్డ్ అటెంప్ట్ మెగా ఫ్యాన్స్ కి రుచించకపోయినా నటిగా ఆమెకు సంతృప్తి పరుస్తుందని చెప్పొచ్చు.

ఐతే నిహారిక సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా వైరల్ అయ్యింది. ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని అన్న వారికి తన సెకండ్ ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది నిహారిక. అందుకే కాదల్ సుడుగుడు అంటూ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది. సినిమా అక్కడ సక్సెస్ అయితే మాత్రం నిహారికకు కచ్చితంగా మంచి ఆఫర్లే వస్తాయి. తెలుగు అమ్మాయిలకు తమిళ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఐతే అందరు తమ యాక్టింగ్ తో తంబీల మనసు గెలుస్తారు. కానీ నిహారిక మాత్రం ఈసారి గ్లామర్ మంత్రంతో వారి మనసులు గెలవాలని చూస్తుంది. సాంగ్ రిలీజైన దగ్గర నుంచి సోషల్ మీడియా చెక్కర్లు కొడుతున్న ఈ మూమెంట్ చూస్తుంటే నిహారిక ఒక విధంగా సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.