Begin typing your search above and press return to search.

భ‌ర్తతో విడిపోవ‌డం ఏ స్త్రీకి అయినా బాధాక‌రం: నిహారిక‌

నిహారిక కొణిదెల తన భర్త, టెకీ చైతన్య నుంచి బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. విభేదాలతో ఈ జంట విడిపోయింది.

By:  Tupaki Desk   |   7 March 2025 9:22 AM IST
భ‌ర్తతో విడిపోవ‌డం ఏ స్త్రీకి అయినా బాధాక‌రం: నిహారిక‌
X

నిహారిక కొణిదెల తన భర్త, టెకీ చైతన్య నుంచి బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. విభేదాలతో ఈ జంట విడిపోయింది. ప్ర‌స్తుతం నిహారిక తన కెరీర్‌పై దృష్టి సారించింది. నిర్మాతగా, నటిగా జోడు గుర్రాల ప్ర‌యాణాన్ని అద్భుతంగా సాగిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో విడాకులతో త‌న కల‌త గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ స్త్రీకైనా బాధాకరమైన అనుభవం అని నిహారిక‌ అంగీకరించింది. ``విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు ప‌రిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది`` అని తెలిపింది.

జీవితంలో స‌వాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. నిహారిక బాధాక‌ర‌మైన ఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డి పూర్తిగా సినిమా కెరీర్ పై దృష్టి సారించారు. ఇటీవ‌ల `కమిటీ కుర్రోళ్ళు` సినిమాను నిర్మించింది. తమిళ చిత్రం `మద్రాస్కారన్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. `వాట్ ది ఫిష్`లో గ్లామరస్ పాత్రతో నిహారిక మెరిపించ‌నుంది.