ప్రొడ్యూసర్ నిహారిక సెకండ్ మూవీ కన్ఫర్మ్ అయినట్టేనా
ఇప్పటికే పలు సిరీస్‌లు నిర్మించిన మెగా డాటర్ నిహారిక గతేడాది కమిటీ కుర్రోళ్లు సినిమాతో పూర్తి స్థాయి సినీ నిర్మాతగా మారి భారీ హిట్ అందుకుంది.
By: Tupaki Desk | 19 March 2025 4:17 PM ISTమెగా తనయ, నాగ బాబు కూతురు నిహారిక ముందు యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో నటిగా, నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఒక మనసు సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
తర్వాత కూడా నిహారిక హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ అవేమీ తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. ప్రస్తుతం నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తోంది. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ ను నిర్మించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లోనే నిహారిక సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తోంది.
ఇప్పటికే పలు సిరీస్‌లు నిర్మించిన మెగా డాటర్ నిహారిక గతేడాది కమిటీ కుర్రోళ్లు సినిమాతో పూర్తి స్థాయి సినీ నిర్మాతగా మారి భారీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో నిహారిక ఇండస్ట్రీకి చాలా మంది కొత్త టాలెంట్ ను పరిచయం చేసింది. చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు రూ.50 కోట్లు కలెక్ట్ చేసి భారీ సక్సెస్ ను అందుకుంది.
ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలైందని, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రాజెక్టుల్లో ఎంతోకాలంగా అసోసియేట్ గా ఉన్న మానస శర్మ దర్శకత్వంలో నిహారిక రెండో సినిమాను నిర్మించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మానస శర్మ ఆల్రెడీ ఇదే బ్యానర్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా జీ5 కోసం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ తో పాటూ డైరెక్టర్ గా సోనీ లివ్ కోసం బెంచ్ లైఫ్ అనే సిరీస్ చేశారు.ఇప్పుడు మానస శర్మ, పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ లో తన మూడవ ప్రాజెక్టును చేయనున్నారు. అయితే ఈ సారి మానస చేస్తుంది వెబ్ సిరీస్ కాదు సినిమానే. నిర్మాతగా నిహారికకు ఇది రెండో సినిమా. మొదటి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని షూటింగ్ నుంచి ప్రమోషన్స్, రిలీజ్ వరకు అన్నీ తానై చూసుకున్న నిహారిక ఈ రెండో ప్రాజెక్టు విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.