Begin typing your search above and press return to search.

పవన్‌ అడ్డాల్లో నిహారిక 'కమిటీ కుర్రోళ్ళు'

ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసి గెలిచిన నియోజక వర్గ సిటీలు అన్నింటిలో కూడా కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రీమియర్ లు వేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Aug 2024 7:18 AM GMT
పవన్‌ అడ్డాల్లో నిహారిక కమిటీ కుర్రోళ్ళు
X

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిహారిక నటిగా కంటే నిర్మాతగా ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత నటనకు దూరం అయిన నిహారిక ఆ మధ్య ఒక వెబ్‌ మూవీలో నటించింది. కానీ ఆ తర్వాత మళ్లీ నటనకు దూరంగా ఉంటూ వస్తుంది.

తాజాగా నిహారిక బ్యానర్‌ లో 'కమిటీ కుర్రోళ్ళు' అనే సినిమా రూపొందింది. అంతా కొత్త వారితో యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నిహారిక సమర్పిస్తోంది. కొణిదెల పద్మజ మరియు జయలక్ష్మి అడపాక లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

16 మంది కొత్త వారితో నిహారిక చేసిన ఈ ప్రయత్నం గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రేక్షకుల్లోకి ఈ సినిమాను తీసుకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనాల దృష్టిని ఆకర్షించేందుకు గాను నిహారిక సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోందనే సమాచారం అందుతోంది.

నిహారిక సన్నిహితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏపీలో ప్రత్యేకంగా ప్రీమియర్ చేయబోతున్నారట. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసి గెలిచిన నియోజక వర్గ సిటీలు అన్నింటిలో కూడా కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రీమియర్ లు వేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఆగస్టు 9న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పవన్ అడ్డాల్లో ఈ సినిమాను ప్రీమియర్ చేయడం ద్వారా వార్తల్లో నిలవడం తో పాటు, పవన్‌ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన దక్కే అవకాశం ఉందని నిహారిక భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీ గెలిచిన ప్రతి చోట కూడా మెగా ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. కనుక నిహారిక కోసం, బాబాయి పవన్ కోసం అయినా కమిటీ కుర్రోళ్ళు సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్‌ టాక్‌ వస్తే భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ అడ్డాల్లో కమిటీ కుర్రాళ్ళు ప్రీమియర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఈ ప్రతిపాదన, ప్రయోగాత్మక ప్రమోషన్‌ చర్చల దశలోనే ఉందని, ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి.