వామ్మో నిహారిక గ్లామర్ డోస్ పెంచేసిందిగా..!
ఆ ఫోటోల్లో ఆమె కేవలం ఒక్క షర్ట్ మాత్రమే ధరించింది. తెలుపు రంగు షర్ట్ ధరించి, స్టూల్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
By: Tupaki Desk | 13 Sep 2023 9:47 AM GMTమెగా ప్రిన్సెస్ నిహారిక గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైన నటి నిహారికనే. మొదట యాంకరింగ్ తో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నెమ్మదిగా హీరోయిన్ గా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే, కొన్ని సినిమాలు చేసింది కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో, సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. రీసెంట్ గానే విడాకులు తీసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించేశారు. అయితే, ఆ తర్వాత నుంచి ఆమె తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటకు తీయడం మొదలుపెట్టింది. మొదటి నుంచి నిహారిక మోడ్రన్ గా కనిపించేందుకు ఇష్టపడేది కానీ, ఎప్పుడైతే ఈ విడాకుల వ్యవహారం బయటకు వచ్చిందో, అప్పటి నుంచి మరింత గా గ్లామరస్ గా కనిపించడం మొదలుపెట్టింది.
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు బికినీ ధరించిన ఫోటోలు షేర్ చేసింది. ఆ తర్వాత క్లీవేజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెడుతూనే ఉంది. ఇక, నిహారిక సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
అయితే, ఆ ఫోటోల్లో ఆమె కేవలం ఒక్క షర్ట్ మాత్రమే ధరించింది. తెలుపు రంగు షర్ట్ ధరించి, స్టూల్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫోటోలు బాగున్నాయి. కానీ, నిహారికను ఇలా చూడటం చాలా మందికి షాకిచ్చింది. మరీ ఇంత బోల్డ్ నెస్ అవసరమా అని చాలా మంది కామెంట్స్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి.
ఇక, విడాకుల తర్వాత నిహారిక ఇటీలవల తన తండ్రి నాగ బాబు, అన్న వరుణ్ తేజ్ తో కలిసి ఆఫ్రికా ట్రిప్ కి వెళ్లింది. ఆ ట్రిప్ ఫోటోలు కూడా వారు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. కాగా, ఆ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఈ ఫోటోలు షేర్ చేశారు. ఇక త్వరలోనే ఆమె సోదరుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి పనులను నిహారిక స్వయంగా చూసుకుంటుండటం విశేషం.