Begin typing your search above and press return to search.

మొదటి సారి నిహారిక విడాకుల గురించి ఓపెన్ అయ్యింది

నిర్మాత‌గా బిజీగా ఉండ‌టంతో న‌ట‌న‌కు దూర‌మ‌య్యాను అంతే. కానీ పెళ్లి చేసుకునే ముందు ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవాలి

By:  Tupaki Desk   |   26 Jan 2024 8:45 AM GMT
మొదటి సారి నిహారిక విడాకుల గురించి ఓపెన్ అయ్యింది
X

మెగా డాట‌ర్ నిహారిక విడాకుల‌తో షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. చైత‌న్య జొన్న‌ల గ‌డ్డ‌తో ధాంపత్య జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇద్ద‌రు విడాకుల‌తో వేర‌య్యారు. ఇద్ద‌రి మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో పెళ్లైన రెండేళ్ల‌కే దూర‌మయ్యారు. అయితే విడాకుల‌కు గ‌ల కార‌ణాల‌పై చైత‌న్య గానీ...నిహారిక గానీ ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారి నిహారిక స్పందించింది . 'పెళ్లి త‌ర్వాత నేను సినిమాలు చేయ‌లేదు. పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే సినిమాలు మానేసాన‌ని చాలా మంది అనుకున్నారు. మావ‌దిన లావ‌ణ్య‌ని కూడా ఇదే ప్ర‌శ్న అడిగారు. అది మా వృత్తి. మేము ఎందుకు వ‌దిలేస్తాం.

నిర్మాత‌గా బిజీగా ఉండ‌టంతో న‌ట‌న‌కు దూర‌మ‌య్యాను అంతే. కానీ పెళ్లి చేసుకునే ముందు ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవాలి. అది తెలియ‌కుండా మ‌న‌కు సెట్ అవ్వ‌ని వ్య‌క్తిపై ఆధార‌ప‌డ‌కూడ‌దు. వాళ్లు మ‌న ఇంట్లో అమ్మ‌-నాన్న‌లా ఉండ‌రు క‌దా. అంత ప్రేమ‌గా అస్స‌లు చూసుకోలేరు. అందుకే ఎవ‌రి మీద ఆధార‌ప‌కుండా ఒంట‌రిగా ఎలా ఉండాలో ఈ మ‌ధ్యే నేర్చుకున్నాను. నాది పెద్ద‌లు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న స‌మ‌యంలో చాలా మాటలు అన్నారు. బాధ క‌లిగి ఏడ్చాను. అలాంటి వాటిని భ‌రించ‌డం అంత ఈజీ కాదు. ఎవ‌రైనా జీవితంలో క‌లిసి ఉండాల‌నే పెళ్లి చేసుకుంటారు.

ఏడాదిలో విడిపోతామ‌ని తెలిసి ఎవ‌రూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు. కానీ ఏది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌దు కదా. నా గురించి రాసినా ప‌ట్టించుకునే దాన్ని కాదు. కానీ నా క్యారెక్ట‌ర్ ని త‌ప్పు బ‌ట్టారు. నా కుటుంబాన్ని దూషించారు. అప్పుడు త‌ట్టుకోలేక‌పోయాను. కానీ నా కుటుంబం న‌న్ను ఎప్పుడు బ‌రువు అనుకోలేదు. ఈ రెండేళ్ల‌లో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్లి-విడాకుల త‌ర్వాత ఎవ‌ర్నీ న‌మ్మ‌కూడ‌ద‌ని అర్ద మైంది. ఇదొక గుణపాఠం. ఎప్ప‌టికీ సింగిల్ గా ఉండిపోను. నా కింకా 30 ఏళ్లే. మంచి వ్య‌క్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటా' అంది.