Begin typing your search above and press return to search.

చీరలో నిహారిక.. ఇదేమి గారడీ

మెగా డాటర్ గా టాలీవుడ్ లో సుపరిచితురాలైన నిహారిక కొణెదల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   5 Aug 2024 4:09 AM GMT
చీరలో నిహారిక.. ఇదేమి గారడీ
X

మెగా డాటర్ గా టాలీవుడ్ లో సుపరిచితురాలైన నిహారిక కొణెదల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సెలక్టివ్ గా ఆమె మూవీస్ చేస్తూ వస్తోంది. అయితే హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై నిహారిక ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నటిగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన నిహారిక నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది.

గత ఏడాది డెడ్ ఫిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మెప్పించింది. అలాగే నిర్మాతగా కూడా మారిన నిహారిక ఆరంభంలో వెబ్ సిరీస్ లని నిర్మించింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్ లు నిర్మాతగా ఆమెకి సక్సెస్ లు ఇచ్చాయి. దీంతో ప్రొడ్యూసర్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో నిహారిక బిజీగా ఉంది.

అలాగే నటిగా మంచు మనోజ్ వాట్ ది ఫిష్ సినిమాలో నిహారిక నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే నిహారిక కొణెదల నటిగా కంటే ప్రొడ్యూసర్ గానే బిజీ అవ్వాలని అనుకుంటుంది. అయితే అప్పుడప్పుడు మాత్రం తెరపై కనిపించడానికి ఆసక్తి చూపిస్తోంది. మరో వైపు గ్లామర్ పరంగా కూడా రోజు రోజుకి నిహారిక అందంతో అందరిని మాయ చేస్తోంది. సోషల్ మీడియాలో నిహారిక చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు వెకేషన్ ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్ లని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పింక్ కలర్ కాటన్ శారీలో దిగిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే ఇదేమి గారడీ అనే పాటను కూడా జత చేసింది. ఈ ఫోటోలలో నిహారిక చాలా అందంగా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. క్లాసిక్ టచ్ తో నిహారిక చీరకట్టులో ఆకట్టుకుంటుందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.