Begin typing your search above and press return to search.

చిరు ఎత్తుకున్న ఈ నిర్మాతని గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టారా... చిన్న వయసులోనే బుల్లి తెరపై సందడి చేసి, ఆ తర్వాత హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   22 Aug 2024 10:56 AM GMT
చిరు ఎత్తుకున్న ఈ నిర్మాతని గుర్తుపట్టారా?
X

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మరియు ఆయన సన్నిహితులు ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. లక్షల మంది మెగా ఫ్యాన్స్‌ వేరు వేరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చిరంజీవి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వస్తున్నారు. అందరి దృష్టిని ఈ ఫోటో తెగ ఆకర్షిస్తోంది.


ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో గుర్తు పట్టారా... చిన్న వయసులోనే బుల్లి తెరపై సందడి చేసి, ఆ తర్వాత హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. వెబ్‌ సిరీస్ లో కూడా నటించి పలు షార్ట్‌ ఫిల్మ్స్ మరియు వెబ్‌ సిరీస్ లను నిర్మించడం ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మొదటి ఈమె ఒక సినిమా తో నిర్మాతగా మారింది. ఆ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయ్యి ఉంటుంది.. ఔను మెగా డాటర్‌ నిహారిక .

నిహారిక నిర్మాతగా ఇటీవల విడుదల అయిన కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముందు ముందు నిహారిక నిర్మాతగా పెద్ద సినిమాలు కూడా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నటిగా నిహారిక కు పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. కానీ నిర్మాతగా మాత్రం ఆమెను మెగా ఫ్యామిలీ వారు మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా ప్రోత్సహించారని, అందుకే కమిటీ కుర్రాళ్లు సినిమా భారీగా వసూళ్లు సాధిస్తూ ఉందని సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో నిహారిక షేర్‌ చేసిన ఈ క్యూట్‌ ఫోటోను మెగా ఫ్యాన్స్ చాలా మంది షేర్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పెదనాన్నకి నిహారిక ఇచ్చిన బర్త్‌ డే గిఫ్ట్‌ ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, ఈ ఫోటో ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఓల్డ్‌ అవ్వదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తన ఇద్దరు కూతుళ్లతో సమానంగా నిహారిక ను చూస్తారు అని మెగా ఫ్యామిలీకి చెందిన వారు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాగే నిహారిక కూడా నాగబాబు తో పాటు చిరంజీవి కి కూడా తండ్రి తో సమానంగా గౌరవం ఇస్తూ, ఆయన మాటకు కట్టుబడి ఉంటుంది.