నిహారిక.. పసిడి వర్ణంతో మెరిసిపోతూ
వివరాళ్లోకి వెళితే.. నిహారిక.. ట్రెడిషనల్‌గా ఆరెంజ్ కలర్ సిల్క్ చీరలో జాకెట్ లేకుండా.. శైలపుత్రి సంప్రదాయంలో కనిపించి ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 16 Oct 2023 8:32 AM GMTమెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. నటిగా ఎదిగే ప్రయత్నాల్లో.. నిహారిక చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తూ, ఫారెన్ ట్రిప్స్‌కు వెళ్తూ..లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కళ్లు చెదిరే రేంజ్లో రెట్రో ఫొటోషూట్ చేయగా అది ఫుల్ వైరల్‌గా మారింది.
వివరాళ్లోకి వెళితే.. నిహారిక.. ట్రెడిషనల్‌గా ఆరెంజ్ కలర్ సిల్క్ చీరలో జాకెట్ లేకుండా.. శైలపుత్రి సంప్రదాయంలో కనిపించి ఆకట్టుకుంది. "శైలపుత్రి, పర్వతాల కూతురు. ఆరెంజ్ కలర్ ప్రకాశాన్ని, బలాన్ని, దయను రిప్రజెంట్ చేస్తుంది" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ప్రాచీన కాలం నాటి కట్టడాలపై సూర్యుని కిరణాలు పడి.. వాటి నీడలు మధ్య నిహారిక కూర్చొని ఉండటం, అవే కిరణాలు ఆమె నారింజ రంగు చీరపై కూడా పడటం, ఆ వెలుగులో నిహారిక ముఖం మిలమిల మెరవడం.. అంతా చాలా బాగా కనిపించాయి. నిహారికకు మరింత అందాన్ని తెచ్చాయి.
నిహారిక బ్లౌజ్ లెస్ చీర డిజైన్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఆమె ధరించిన జ్యూవెలరీ, హెయిర్‌ను లూస్‌గా వదిలేయడంతో తన ఫేస్ ఎంతో ఛార్మింగ్‌గా కనిపించింది. మొత్తంగా ఆమె రెట్రో లుక్ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. కాగా, అంతకుముందు డార్క్ థీమ్‌తో కూడా కొన్ని అదిరే పోజుల్లో కాకరేపింది నిహారిక. ఈ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక... ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సహా పలు చిత్రాల్లో నటించింది. అవి వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. నిర్మాణ సంస్థ స్థాపించి భర్తతో కలిసి సినిమాలను నిర్మించింది. కానీ ఆ తర్వాత ఆమె వివాహ జీవితం సాఫీగా సాగలేదేమో విడాకులు కూడా తీసుకుని మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.