Begin typing your search above and press return to search.

చీరలో నిహారిక స్టన్నింగ్!

తాజా ఫొటోషూట్​లో బ్లూ కలర్ శారీలో బ్లౌజ్ లేకుండా చీరలో కనువిందు చేసింది నిహారిక.

By:  Tupaki Desk   |   19 Oct 2023 8:41 AM GMT
చీరలో నిహారిక స్టన్నింగ్!
X

గత కొద్ది రోజులుగా నిహారిక కొణిదెల గ్లామరస్ ఫోటో షూట్స్​తో సోషల్​ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి అయితే భిన్నమైన గెటప్స్​ను ట్రై చేస్తూ వేదాంతాలను క్యాప్షన్లుగా రాసుకొస్తోంది. తాజాగా మరో ఫొటోషూట్​లో బ్లౌజ్ లేకుండా చీర ధరించి మత్తు పోజులిచ్చింది. అవి నెటింట బాగా చక్కర్లు కొడుతున్నాయి.


వివరాళ్లోకి వెళితే.. ప్రస్తుతం నిహారిక కుటుంబంలో పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి -వరుణ్ తేజ్​ల వివాహం నవంబర్ 1న జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనుల్లో నిహారిక కూడా కాస్త బిజీగా ఉంటూనే ఈ ఫొటోషూట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తాజా ఫొటోషూట్​లో బ్లూ కలర్ శారీలో బ్లౌజ్ లేకుండా చీరలో కనువిందు చేసింది నిహారిక. సైడ్ అండ్ ఫ్రంట్ యాంగిల్​లో పోజులిచ్చింది. రెండు జడలు వేసుకుని, ముక్కుపుడుక, మెడలో నెక్లెస్​ ధరించి రెట్రో లుక్​లో ఆకట్టుకుంది. విశ్వ సృష్టికర్త​ గాడెసెస్​ కూష్మాడ సెలబ్రేషన్స్​ చేసుకుంటున్నాను. ఈ నీలి రంగు సమస్త సృష్టి, ఇందులో ఉన్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. అని రాసుకొచ్చింది.

ఈ పిక్స్​ను నెటిజన్లు, మెగా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరూ అందంగా, జై మాతాజీ అంటూకామెంట్స్​ చేస్తుంటే మరికొందరు మాత్రం బిక్షు యాదవ్​ ముక్కుపుడుకలా ఉంది, ఎవరి కోసం చేస్తున్నావ్​ ఇదంతా అంటూ నెగటివ్​ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి కథనాయికగా సిల్వర్​ స్క్రీన్​ అరంగేట్రం చేసిన నిహారిక... ఒక మనసు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సహా పలు సినిమాల్లో నటించింది. అవి అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. ప్రొడక్షన్​ హౌస్​ను స్థాపించి భర్తతో కలిసి చిత్రాలను కూడా నిర్మించింది. కానీ ఆ తర్వాత ఆమె వివాహ జీవితం సాఫీగా సాగలేదేమో క్లారిటీ లేదు కానీ.. విడాకులు అయితే తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కెరీర్​పై పూర్తి దృష్టి పెట్టింది.