నిఖిల్ న్యూ మూవీ టీజర్.. ఎలా ఉందంటే?
ట్విస్ట్స్, ప్రేమ కథతో కూడిన ఒక థ్రిల్లింగ్ రైడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తెరకెక్కుతుందని ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవ్వగా.
By: Tupaki Desk | 11 Oct 2024 11:33 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కొత్త చిత్రాల కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ రీసెంట్ గా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశారు. ఎలాంటి సౌండ్ లేకుండా.. షూటింగ్ పూర్తి చేశారు. దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సర్పైజ్ గా ప్రకటించేశారు.
అయితే సుధీర్ వర్మ, నిఖిల్ కాంబోలో ఇప్పటికే స్వామిరారా, కేశవ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో మరోసారి కాంబో రిపీట్ అవుతుంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తున్న మేకర్స్.. తాజాగా మూవీ టీజర్ ను విడుదల చేశారు.
ట్విస్ట్స్, ప్రేమ కథతో కూడిన ఒక థ్రిల్లింగ్ రైడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తెరకెక్కుతుందని ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవ్వగా.. టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. రేసింగ్ విజువల్స్ తోనే టీజర్ స్టార్ట్ అయింది. మంచి రేసర్ గా నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. వీడి పేరు రిషి.. లోకల్ లో మంచి రేసర్.. లండన్ వెళ్లి తెల్ల పిల్లను పడేసి ప్రపంచ మొత్తంగా చూట్టేదామనుకున్నాడు అనే డైలాగ్ తో హీరోను పరిచయం చేశారు.
ఆ తర్వాత లండన్ వెళ్లిన హీరో.. దివ్యాంశ కౌశిక్ తో ప్రేమలో పడినట్లు చూపించారు. ఇంతలో విలన్ ఎంట్రీతో టీజర్ మలుపు తిరిగింది. మొత్తం స్టోరీ చెబుతా అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు నిఖిల్. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టేశారు. ప్రపంచంలో 90 శాతం అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయి లేరా అనే నిఖిల్ డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది. మొత్తానికి సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. సినీ ప్రియులను ఆకట్టుకుంటూ మూవీపై బజ్ క్రియేట్ చేస్తోంది.
నిఖిల్ ఎప్పటిలానే తన యాక్టింగ్ తో అలరించారు. రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. క్రేజీ స్టోరీతో మూవీ మెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఫారిన్ విజువల్స్ బాగున్నాయి. కార్తికేయ, కేశవ ఫేమ్ సన్నీ ఎం ఆర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా టీజర్ ను సరైన రీతిలో మేకర్స్ కట్ చేశారని చెప్పాలి. మరి నవంబర్ 8వ తేదీన రిలీజ్ కానున్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.