బిగ్ బాస్ విన్నర్ కి ఊహించని హెడేక్..!
గౌతంతో చివరి వరకు ఫైట్ లో ఉండి చివరకు విజేతగా నిలిచిన నిఖిల్ బయటకు రాగానే తను సమాధానం చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఏర్పడ్డాయి.
By: Tupaki Desk | 20 Dec 2024 5:34 PM GMTబిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. గౌతంతో చివరి వరకు ఫైట్ లో ఉండి చివరకు విజేతగా నిలిచిన నిఖిల్ బయటకు రాగానే తను సమాధానం చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా నిఖిల్ అంతకుముందు కావ్యతో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నాడు. హౌస్ లో తన బ్రేకప్ లవ్ గురించి చెబుతూ బయటకు వెళ్లాక తను అర్థం చేసుకుంటుందో లేదో అని అన్నాడు. ఐతే బయట మాత్రం కావ్య నటించడం వచ్చిన వారు ఎక్కడైనా ఎలాంటి సందర్భంలో అయినా నటిస్తారని అని ఇన్ స్టాగ్రాం లో పెట్టింది.
గోరింటాకు సీరియల్ లో నిఖిల్, కావ్య కలిసి పనిచేశారు. దాదాపు రెండు మూడేళ్లు ఇద్దరు కలిసి సీరియల్ లో నటించడం తో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. స్టార్ మా రియాలిటీ షోలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. అంతేకాదు ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని చూపించారు. ఐతే సడెన్ గా ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ కి వెళ్లే ముందు నిఖిల్, కావ్య దూరమయ్యారు. హౌస్ లో నిఖిల్ వేరే అమ్మాయిలతో క్లోజ్ గా ఉండటం కూడా కావ్యకు నచ్చలేదు.
అందుకే అతను హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. ఐతే బయటకు వచ్చిన నిఖిల్ కి కావ్య పెట్టిన ఈ మెసేజ్ లు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్లినా సరే నిఖిల్ విషయంలో కావ్య చేసిన మెసేజ్ ల గురించి అడుగుతున్నారు. కావ్యతో అసలు ఎందుకు బ్రేకప్ అయ్యిందో ప్రశ్నిస్తున్నారు. కావ్యతో నిఖిల్ ఆల్ మోస్ట్ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకునారు. ఎందుకు విడిపోయారు అన్నది చెప్పట్లేదు కానీ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నిఖిల్ మీద కావ్య మరింత ఫైర్ మీద ఉందని తెలుస్తుంది.
బిగ్ బాస్ టైటిల్ గెలిచాం అన్న ఆనందం కన్నా ఎక్కడికి వెళ్లినా కావ్యతో ఎందుకు బ్రేకప్ అయ్యిందన్న ప్రశ్న నిఖిల్ కి హెడేక్ గా మారింది. అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ విషయంలో స్టార్ మా కావాలని నిఖిల్ ని విన్నర్ చేస్తుంది అంటూ అఖిల్ సార్ధక్ చేసిన కామెంట్స్ పై కూడా నిఖిల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అతను రెండు సార్లు బిగ్ బాస్ కి వెళ్లాడు కదా అని అన్నాడు నిఖిల్. తాను ఎలా ఉన్నానో అలానే ఆట ఆడానని అందుకే ప్రేక్షకులు తనని గెలిపించారని అన్నాడు నిఖిల్. తనకు కె బ్యాచ్, టీ బ్యాచ్ ఇవేవి తెలియవని అన్నాడు. తాను ఇండియన్ ని అని చెప్పి ఆడియన్స్ ని మెప్పించాడు.