నిఖిల్.. ఆ తప్పు చేయకపోయి ఉంటే..
అయితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ విషయంలో నిఖిల్ ఒక తప్పు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 7:30 PM GMTస్వామి రారా, కేశవ చిత్రాల తర్వాత యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబోలో రీసెంట్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు నిర్వహించారో ఎవరికీ తెలియదు. ఎలాంటి సౌండ్ లేకుండా మూవీ అప్డేట్ ఇచ్చి షాకిచ్చారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
ప్రమోషన్స్ టైమ్ లో కరోనా సమయంలో షూట్ చేసినట్లు తెలిపారు. కట్ చేస్తే.. మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ అందుకుంది. క్రైమ్ అండ్ లవ్ జోనర్ లో సుధీర్ మూవీని తెరకెక్కించారు. కానీ సినిమాలో ఎక్కడా క్రైమ్ థ్రిల్లర్ ఇచ్చే అనుభూతి కల్పించలేకపోయారు. అలా అని లవ్ స్టోరీని కూడా స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. అనేక మలుపులు, ఫ్లాష్ బ్యాకులు ఉన్నా.. ఆడియెన్స్ కు ఎక్కలేదు.
స్క్రీన్ ప్లే విషయంలో సుధీర్ వర్మ కాస్త కష్టపడినట్లు అనిపించినా.. ఆడియెన్స్ కు అస్సలు నచ్చలేదు మూవీ. మేకింగ్ చాలా పాత పద్ధతులకు చెందినట్లు అనిపిస్తుంది. నిఖిల్ మాత్రం యాక్టింగ్ పరంగా న్యాయం చేశారు. తనకు అలవాటైన రోల్ లో కనిపించి మెప్పించారు. కానీ తలా తోకా లేని కథతో మూవీ ఉండడం వల్ల.. నిఖిల్ ఖాతాలో డిజాస్టర్ చేరింది.
అయితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ విషయంలో నిఖిల్ ఒక తప్పు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా మారిన స్పై మూవీ విషయంలో చేసిన తప్పే రెండోసారి చేశారని అంటున్నారు. అలా రెండేళ్ళలో రెండు డిజాస్టర్ లు అందుకున్నారని చెబుతున్నారు. కాస్త గట్టిగా ప్రమోషన్స్ చేసి ఉంటే కనీసం ఓపెనింగ్స్ బాగా వచ్చేవని అభిప్రాయపడుతున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ -2 మూవీ తర్వాత నిఖిల్ యాక్ట్ చేసిన స్పై.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో నిఖిల్ కు ప్రొడ్యూసర్ కు చిన్న డిస్టర్బేన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నిఖిల్ కాస్త లేట్ గా ప్రమోషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు! దూకుడుగా ఆయన ప్రమోట్ చేసినప్పటికీ మూవీపై బజ్ పెద్దగా క్రియేట్ అవ్వలేదు. దీంతో కనీస వసూళ్లు కూడా రాబట్టలేదు.
ఇప్పుడు.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. నిఖిల్ స్టార్టింగ్ లో ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపించలేదు. కాస్త లేట్ గానే మూవీని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. పలు మీడియాలకు ఇంటర్వ్యూస్ మాత్రమే ఇచ్చారు. వాటితో మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయారు. దీంతో ఆ మూవీ నిఖిల్ కెరీర్ లోనే లోయస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. మరి కొత్త చిత్రాల విషయంలో నిఖిల్ మరోసారి ఈ తప్పును రిపీట్ చేయకపోతే చాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.