Begin typing your search above and press return to search.

క్యాన్సల్‌ కాలేదు.. లైన్‌లోనే మూడు సినిమాలు

దాంతో సినిమా క్యాన్సల్‌ అయిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 March 2025 1:59 PM IST
క్యాన్సల్‌ కాలేదు.. లైన్‌లోనే మూడు సినిమాలు
X

యంగ్‌ హీరో నిఖిల్‌ గత ఏడాది 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయినా నిఖిల్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిఖిల్‌ చాలా కాలం క్రితం స్వయంభూ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. విభిన్నమైన సోషియో ఫాంటసీ సినిమాగా స్వయంభూ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఇన్నాళ్లు పూర్తి కాలేదు. దాంతో సినిమా క్యాన్సల్‌ అయిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గత కొన్ని నెలలుగా పూర్తిగా సైలెంట్‌గా ఉన్న నిఖిల్‌ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థతో నిఖిల్‌ మాట్లాడుతూ తన ప్రాజెక్ట్‌లపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. అందులో స్వయంభూ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని అన్నాడు. ఆ సినిమా ఏకంగా 95 శాతం షూటింగ్‌ ముగిసిందని, కొన్ని కారణాల వల్ల సినిమాను రహస్యంగా షూటింగ్‌ పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. త్వరలోనే బ్యాలన్స్ వర్క్‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే సినిమా గురించిన అప్డేట్‌ను అధికారికంగా వెళ్లడించబోతున్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు.

స్వయంభూ సినిమా కోసం నిఖిల్‌ మార్షల్ ఆర్ట్స్‌, కత్తి యుద్దంలో శిక్షణ పొందాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా రూపొందుతుంది అంటూ నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. కీలక పాత్రలో నభా నటేష్ నటిస్తుంది. స్వయంభూ సినిమాతో పాటు 'ది ఇండియా హౌస్‌' అనే సినిమాలోనూ నిఖిల్‌ నటిస్తున్నాడు. ఆ సినిమాకు రామ్‌ చరణ్‌ ఒక నిర్మాత కావడం విశేషం. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ది ఇండియా హౌస్ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.

ఈ రెండు సినిమాల్లో స్వయంభూ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అని నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. మరో వైపు ది ఇండియా హౌస్ సినిమా మాత్రం వచ్చే ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా నిఖిల్‌ నటించిన సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ కార్తికేయ మూడో భాగంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తండేల్‌ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చందు మొండేటి కార్తికేయ 3 సినిమాను చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకోసం స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉంది. నిఖిల్ తాజాగా ఆ విషయమై స్పందిస్తూ కార్తికేయ 3 సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చందు మొండేటి ఎప్పుడు అంటే అప్పుడు తాను రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.