వియత్నాం ఫైటర్లతో నిఖిల్ వార్!
యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన సినిమాలే నిఖిల్ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి.
By: Tupaki Desk | 9 May 2024 7:16 AM GMTయంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన సినిమాలే నిఖిల్ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి. ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం `స్వయంభూ` అనే పిరియాడిక్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పురాణ యోధునిగా సవాలు చేసే పాత్రను పోషిస్తున్నాడు. యుద్ధ భూమిలో మార్షల్ ఆర్ట్స్ - గుర్రపు స్వారీ సన్నివేశాలు సినిమాకే హైలైట్ . వాటి కోస ప్రత్యేకంగా వియత్నాంలో శిక్షణ తీసుకున్నాడు.
దేశంలోని ఆరితేరిన స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో కఠోర శిక్షణ పూర్తి చేసాడు. యోధుడి రోల్ కావడంతో ఈ కష్టం తప్పలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్..ఇతర ప్రచార చిత్రాలతో ఆద్యంతం సినిమాపై క్యూరియాసిటీ రెట్టింపు అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ప్రస్తుతం 8 కోట్ల ఖర్చుతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రెండు భారీ సెట్లు సిద్దం చేసారు.
అందులో నిఖిల్ తో పాటు 700 మంది జూనియర్ ఆర్టిస్టులు..వియత్నాం ఫైటర్లపై యుద్ద సన్నివేశాలు చిత్రీక రిస్తున్నారు. 12 రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తారు. నిఖిల్ తీసుకున్న వియత్నాం ట్రైనింగ్ అంతా ఈ వార్ సీన్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సన్నివేశం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి వార్ సీన్ ఇంతవరకూ చూసి ఉండరని...ప్రేక్షకుడికి ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఈ సన్నివేశం ఇస్తుందని అంటున్నారు.
పర్పెక్షన్ కోసం నిఖిల్ ఎక్కువ టేక్ లు తీసుకుంటున్నాడుట. స్టంట్ మాస్టర్లు కూడా ఈ వార్ సన్నివేశం కోసం అంతే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి బాహుబలి రేంజ్ వార్ సన్నివేశాన్ని `స్వయంభు` లో ప్రేక్షకులు చూడబోతున్నట్లు చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్-శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.