వియాత్నాంలో నిఖిల్ మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్!
యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన సినిమాలే నిఖిల్ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి
By: Tupaki Desk | 7 Sep 2023 6:40 AM GMTయంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వైవిథ్యమైన సినిమాలే నిఖిల్ ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి. ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. తాజాగా 'స్వయంభూ' ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పురాణ యోధునిగా సవాలు చేసే పాత్రను పోషిస్తున్నాడు.
యుద్ధ భూమిలో మార్షల్ ఆర్ట్స్ - గుర్రపు స్వారీ చేస్తూ కనిస్తున్నాడు. లుక్ ఆద్యంతం సినిమాపై క్యూరియా సిటీని పెంచేస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మార్షల్ ఆర్స్ట్- గుర్రపు స్వారీ శిక్షణకు వియాత్నాం బయల్దేరాడు. సైగాన్‌లో నెల రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమం లో పాల్గొంటాడు. అక్కడ దేశంలోని ఆరితేరిన స్టంట్ మాస్టర్లు టీమ్‌లు నిఖిల్‌కి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణ ఎంతో కఠోరంగా ఉంటుంది. శరీరాన్ని ఎంతో కష్టపెట్టాలి. ట్రైనింగ్ లో రాటు దేటాలాలి. అప్పుడే తెరపై సన్నివేశాలు పండుతాయి. నిఖిల్ అంతటి సమర్దవంతుడే. పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాడు. ఈ రకమైన ఎక్స్ పీరియన్స్ నితిన్ కి ఇదే తొలిసారి. యోధుడి పాత్రలో నిఖిల్ ని చూడటానికి ప్రేక్షకులు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిపిందే. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిఖిల్ గత సినిమా 'స్పై' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. '18 పేజీస్' యావరేజ్ గా ఆడింది. ఇలా రెండు చిత్రాలు నిఖిల్ వేగాన్ని కాస్త తగ్గించాయి. దీంతో స్వయంభు తో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అలాగే చందు మొండేటితో 'కార్తికేయ-3' కి కూడా రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.