ఫ్యామిలీ కోసం నిఖిల్ త్యాగం!
ఇన్నేళ్ల కెరీర్ లో నిఖిల్ పై ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. కామ్ గోయింగ్ గానే కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు
By: Tupaki Desk | 19 April 2024 5:44 AM GMTయంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ జర్సీ సక్సెస్ పుల్ గా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకున్న నటుల్లో నిఖిల్ ఒకరు. `కార్తికేయ-2` తో పాన్ ఇండియాలోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. తన జనరేషన్ నటులు పేడౌట్ అయినా నిఖిల్ మాత్రం తెలివైన కథల్ని ఎంచుకుంటూ కెరీర్ లో అంతకంతకు హైట్స్ కి చేరుకుంటున్నాడు. భవిష్యత్ లో ఇంకా మంచి ప్యూచర్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో నిఖిల్ పై ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. కామ్ గోయింగ్ గానే కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇక వైవాహిక జీవితంలోనూ నిఖిల్ సక్సెస్ పుల్ గా సంతోషంగా సాగిపోతున్నాడు. ఇటీవలే నిఖిల్ కి ఓ కుమారుడు కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఎలాంటి పార్టీలకు వెళ్లబోనని.. ఇప్పటివరకూ కనీసం వారానికి ఓసారి పార్లీలకు వెళ్లేవాడిని...ఇకపై ఆ ఒక్క వారం కూడా వెళ్లను. పిల్లల్ని మంచి వాతావారణంలో పెంచాలంటే కొన్నింటికి దూరం కావాల్సిందే.
నా కొడుకు ధీర సిద్దార్ధ్ బాధ్యతను పంచుకుంటున్నాను. ఇప్పుడా క్షణాల్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను` అంటూ ప్రకటించాడు. మొత్తానికి నిఖిల్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు నెలల వయసులో ఉన్నప్పుడే నిఖిల్ ఇంత ప్రేమ చూపిస్తున్నాడు..పెరిగి పెద్దవుతున్న కొద్ది అతడి ప్రేమ ఆకాశమంత. పిల్లల కోసం చిన్న చిన్న ఆశలు కూడా వదులుకుంటున్నాడు అందుకు నిఖిల్ గొప్ప తండ్రి అవుతాడు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం నిఖిల్ హీరోగా `స్వయంభు` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా చిత్రం. భారీ అంచనాల మధ్య రూపొందుతుంది. ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్స్ట్.. గుర్రపు స్వారీలు.. కత్తి యుద్దాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. నిఖిల్ లుక్... ఆ పాత్ర కోసం నిఖిల్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.