Begin typing your search above and press return to search.

ఔను.. అతడు తండ్రి కాబోతున్నాడు

గత కొన్ని వారాలుగా యంగ్‌ హీరో నిఖిల్‌ వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయం సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది

By:  Tupaki Desk   |   17 Nov 2023 6:36 AM GMT
ఔను.. అతడు తండ్రి కాబోతున్నాడు
X

గత కొన్ని వారాలుగా యంగ్‌ హీరో నిఖిల్‌ వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయం సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అదే నిఖిల్‌ తండ్రి కాబోతున్నాడు. నిఖిల్‌ కు ఈ మధ్య కాలంలో మంచి టైం నడుస్తోంది. వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న నిఖిల్‌ మరో వైపు తండ్రిగా కూడా ప్రమోషన్ పొందబోతున్నాడు అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇన్ని రోజులు ఆయన కానీ, ఆయన సన్నిహితులు కానీ ఈ విషయాన్ని దృవీకరించలేదు. ఎట్టకేలకు నిఖిల్‌, పల్లవి వర్మ తల్లిదండ్రులు కాబోతున్నారు అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వారిద్దరూ కూడా సన్నిహితుల వద్ద తమ సంతోషం షేర్‌ చేసుకున్నారు.

కరోనా సమయంలో నిఖిల్‌ మరియు డాక్టర్‌ పల్లవి వర్మ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కొద్ది మంది సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరి వైవాహిక జీవితం గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. అవన్నీ కూడా నిజం కాదని ఎప్పటికప్పుడు నిఖిల్ మరియు పల్లవిలు తమ మధ్య ఉన్న ప్రేమతో నిరూపిస్తూ వచ్చారు.

ఇక నిఖిల్‌ కార్తికేయ 2 సినిమా తర్వాత ఫుల్‌ ఫామ్‌ లోకి వచ్చాడు. వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలతో పాటు, ఇప్పటికే కమిట్‌ అయిన రెండు సినిమాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వచ్చే ఏడాది నిఖిల్‌ తండ్రి అవ్వడంతో పాటు, రెండు సూపర్‌ హిట్స్ ని కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.