Begin typing your search above and press return to search.

భారీ రిస్క్​ చేసేందుకు రెడీ అయిన నిఖిల్​..

'కార్తికేయ‌-2'తో పాన్ ఇండియా స‌క్సెస్ అందుకున్న నిఖిల్.. తన కొత్త సినిమా విషయంలో పక్కా ప్లానింగ్​తో ముందుకు వెళ్లేలా చూసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:13 AM GMT
భారీ రిస్క్​ చేసేందుకు రెడీ అయిన నిఖిల్​..
X

'కార్తికేయ‌-2'తో పాన్ ఇండియా స‌క్సెస్ అందుకున్న నిఖిల్.. తన కొత్త సినిమా విషయంలో పక్కా ప్లానింగ్​తో ముందుకు వెళ్లేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే.. 'ది ఇండియా హౌస్', స్వ‌యంభు'..'కార్తికేయ‌-3' లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్​లో ప్లాన్ చేశారు. ఇవి సినీ ప్రియుల్లో మంచి అంచనాలను పెంచాయి. అయితే రీసెంట్​గా 'స్పై' చిత్రంతో భారీ డిజాస్టర్​ అందుకున్న నిఖిల్​ ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని, ప్రేక్షకుల నమ్మకాన్ని వొమ్ము చేయకూడదని మరింత పట్టుదలతో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆయన తాజాగా హిస్టారికల్​ డ్రామా స్వయంభు సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లారు. 14 శతాబ్దంలో జరిగిన ఓ యోధుడి కథతో దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రం తెరకెక్కించడం అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎన్నో సవాళ్లు, రిస్క్​లు ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి చిత్రాన్ని నిర్మించాలంటే ప్రొడ్యూసర్స్​కు.. ఫైనాన్షియల్ ఛాలెంజెస్(ఆర్ధిక సవాళ్లు) ఎదురౌతుంటాయి. భారీ బడ్జెట్​, ప్లాన్​, అందుకు తగ్గ ఎగ్జక్యూషన్​ చాలా అవసరం. అంతకుముందు గతంలో వచ్చిన 'మగధీర', 'బాహుబలి', 'పొన్నియిన్​ సెల్వన్​' సిరీస్​లు.. ఇలాంటి కాన్సెప్ట్​తో తెరకెక్కినవే. వాటికి ఎంతటి బడ్జెట్​ ఖర్చు అయిందో తెలిసిన విషయమే.

ముందుగా ఒకటి అనుకుంటే సినిమా పూర్తయ్యేలోపు వాటి బడ్జెట్​లు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు 'స్వయంభు'ను రూ.30కోట్ల బడ్జెట్​తో రూపొందిస్తున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా కథకు ఉన్న స్కోప్​ ప్రకారం.. ఈ బడ్జెట్​ తక్కువ అని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. దీనికి కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఒకవేళ నిర్మాతలు ఇదే బడ్జెట్​లో రూపొందించాలని రాజీపడి సినిమాను నిర్మిస్తే మాత్రం.. సినిమా క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇంకో సవాల్ ఏంటంటే.. అసలీ యోధుడి పాత్రకు నిఖిల్​ సరైనోడేనా అనేది. ఓ యోధుడి పాత్రలో కనిపించాలంటే ముఖంలో తేజస్సం, కండలు తిరిగిన దేహధారుడ్యం ఉండాల్సిన అవసరం ఉంటుంది. తన నటనతో ప్రేక్షకుల్ని రక్తికట్టించగలగాలి. బాహుబలిలో ప్రభాస్​, మగధీరలో రామ్​చరణ్​ను చూసినప్పుడు ఓ రాజు, యోధుడిలా ఎంతో బాగా పాత్రను పోషించారు. కేవలం నటన మాత్రమే కాదు వారి దేహధారుడ్యం, హావాభావాలు మొత్తం స్ర్రీన్​ ప్రెజెన్స్​ కరెక్ట్​గా సరిపోయింది. మరి ఇప్పటివరకు లవర్ బాయ్​ ఇమేజ్​ ఉన్న నిఖిల్​.. యోధుడి లాంటి పాత్రలను చేయలేదు. ఇదో ఆయనకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఈ పాత్ర కోసం ఆయన నటనలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తన బాడీ లాంగ్వేజ్​ను మార్చుకోవాలి. మరి ఈ పాత్ర కోసం ఆయన ఎలా సన్నద్ధమవుతున్నారు? ప్రాతకు ప్రాణం పోయాడానికి తన నటనలో ఎలాంటి మార్పులు చేసుకుంటున్నారు? పాత్రకు తగ్గటు తన శరీరాకృతిని ఎలా మార్చుకుంటున్నారు? అనేది చూడాలి.

ఏదేమైనప్పటికీ నిఖిల్ కంఫర్ట్ జోను నుంచి బయటికి వచ్చి 'స్వయంభు' వంటి భిన్న కథను ఎంచుకోవడం హర్షించదగ్గ విషయమనే చెప్పాలి. మరి పైసమస్యలను, సవాళ్లను నిఖిల్​ అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొస్తారో? ఆడియెన్స్​ను ఎంత వరకు ఆకట్టుకుంటారో? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.