Begin typing your search above and press return to search.

తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో?

నిఖిల్‌, పల్లవి తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయమై స్పష్టత రాలేదు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 6:39 AM GMT
తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో?
X

హ్యాపీడేస్ తో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయిన నిఖిల్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ యంగ్‌ స్టార్‌ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్‌ లైన్ ని దక్కించుకున్న నిఖిల్‌ 2020 సంవత్సరంలో ప్రేమించిన ప్రియురాలు పల్లవి వర్మ మెడలో మూడు ముళ్లు వేసి ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే.


వీరిద్దరి వైవాహిక జీవితం గురించి ఎన్నో పిచ్చి పుకార్లు వచ్చాయి. వాటన్నింటికి నిఖిల్‌ ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూ వచ్చాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా సంతోషంగా సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఈ దంపతులు ప్రమోషన్ పొందబోతున్నారు అంటూ మీడియా సర్కిల్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిఖిల్‌, పల్లవి తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయమై స్పష్టత రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ విషయం బలంగా చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది నిఖిల్‌ లేదా పల్లవి నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఆ గుడ్‌ న్యూస్‌ ను వినాలి అని నిఖిల్‌ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నిఖిల్‌ ఆ పుకారు నిజమే అంటూ ప్రకటిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక నిఖిల్‌ ప్రస్తుతం కెరీర్‌ లో పీక్స్ లో ఉన్నాడు. కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఇండియన్‌ హౌస్ మరియు స్వయంభు సినిమాలతో రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం నిఖిల్‌ చేస్తున్న రెండు సినిమాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ ఇన్వాల్వ్‌ అయ్యి ఉన్న సినిమాలు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఆ సినిమాలు హిట్ అయ్యేనా, వచ్చే ఏడాదిలో ఆ సినిమాలు హిట్‌ అవ్వడంతో పాటు, తండ్రిగా నిఖిల్‌ ప్రేక్షకుల ముందు నిలిచేనా చూడాలి.