Begin typing your search above and press return to search.

నిఖిల్‌ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...!

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 10:42 AM GMT
నిఖిల్‌ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...!
X

యంగ్‌ హీరో నిఖిల్‌ కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన స్పై సినిమా నిరాశ పరిచింది. దాంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌ వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్‌ తాజా చిత్రం సుధీర్ వర్మతో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. నిఖిల్‌, సుధీర్‌ వర్మ కాంబో మూవీకి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమా పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందని తెలుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. సుధీర్ వర్మ గత చిత్రం రవితేజ తో చేసిన రావణాసుర అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమా పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా నిఖిల్‌ తో గతంలో ఈయన రూపొందించిన స్వామిరారా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వల్లే హీరోగా నిఖిల్‌ కు మంచి క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్ ను సద్వినియోగం చేసుకుంటూ నిఖిల్‌ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. స్వామిరారా సినిమా కాంబో రిపీట్‌ కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో, మీడియా వర్గాల్లో ఆసక్తి నెలకొని సినిమా గురించి చర్చ మొదలు అయింది.

సుధీర్‌ వర్మ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు సాలిడ్ హిట్‌ దక్కక పోవడంతో నిరుత్సాహంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే నిఖిల్‌ తోనే మరో సినిమాకు ఆయన రెడీ అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ను దసరా కానుకగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిఖిల్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ రవితేజ తో ఆఫర్ దక్కడంతో సుధీర్‌ వర్మ ఈ సినిమాను పక్కన పెట్టి రావణాసుర చేయడం జరిగింది.

స్వామిరారా సినిమాతో వీరిద్దరికీ మంచి బ్రేక్‌ దక్కింది. కనుక మరోసారి వీరి కాంబో మూవీ రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. హీరో నిఖిల్‌ ను ప్రేక్షకులు ఇప్పటికే వంద కోట్ల హీరోల జాబితాలో చేర్చారు. కనుక మంచి కాన్సెప్ట్‌ తో సినిమాను చేస్తే తప్పకుండా మరో వంద కోట్ల సినిమాగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ వర్మ తో పాటు నిఖిల్‌ కి ఈ సినిమా హిట్‌ అత్యంత కీలకం. కనుక ఇద్దరు స్వామి రారా సినిమా పలితాన్ని రిపీట్‌ చేస్తారేమో చూడాలి.