Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల నిక్కీ జీన్స్‌లో బోల్డ్‌

మరోసారి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చలికాలంలో వేడి పెంచినట్లు అయ్యింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 12:30 PM GMT
పిక్‌టాక్ : అందాల నిక్కీ జీన్స్‌లో బోల్డ్‌
X

తెలుగు ప్రేక్షకులకు చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయకున్నా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోయింగ్‌ అంతకంతకు పెరుగుతూ ఉంది. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు మరోసారి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చలికాలంలో వేడి పెంచినట్లు అయ్యింది. ఈమె అందాల ఆరబోత ఈసారి కాస్త ఎక్కువ అయ్యిందని కొందరు అంటున్నారు.


సినిమా ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలు చేయకున్నా ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ అమ్మడు స్కిన్ షో చేస్తూ షేర్‌ చేస్తున్న ఫోటోలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేసినా, ఇంత అందంగా ఉన్నా ఎందుకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బోల్డ్‌ లుక్‌లోనూ చాలా అందంగా కనిపించడం కేవలం నిక్కీ తంబోలికే చెల్లుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నిక్కీ అందాల ఆరబోత ఫోటోల గురించి మరోసారి చర్చించుకునే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి.


వైట్‌ టాప్‌ వేసి నడుము అందాన్ని చూపిస్తూ నాభి అందంతో మతి పోగొట్టడం మాత్రమే కాకుండా జీన్స్ వేసుకుని కవ్వించే విధంగా ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్‌ చూపు తిప్పనివ్వడం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా చేసినవి చాలా తక్కువ సినిమాలు. అయినా ఈ అమ్మడికి దక్కిన గుర్తింపు తక్కువేం కాదు. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్స్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ ఉంటుందని ఈ ఫోటోలతో మరోసారి నిరూపితం అయ్యింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమె ఫోటోలకు మంచి ఫాలోయింగ్‌ దక్కుతుంది.


గత ఏడాది బుల్లి తెరపై సందడి చేసిన నిక్కీ తంబోలి ఈ ఏడాదిలో వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్‌బాస్ మరాఠి సీజన్‌ 5లో కనిపించిన నిక్కీ తంబోలి ఆ తర్వాత పలు టీవీ షోల్లో కనిపించింది. ఒకటి రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా ప్రాముఖ్యత లేని పాత్రలు కావడంతో సున్నితంగా తిరస్కరించింది. ప్రత్యేక పాటల్లో, ప్రత్యేక పాత్రల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఈ అమ్మడు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కనుక టాలీవుడ్‌ లేదా ఇతర భాషల్లో ఈ అమ్మడితో ఐటెం సాంగ్‌ చేయిస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈమె ఐటెం సాంగ్‌ వస్తుందేమో చూడాలి.