Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ రేంజ్ ఎంతైనా..అమ్మ‌డి ముందు జుజూబీ!

' ట్రోలింగ్ నాకేం కొత్త కాదు. మీరు ఎలా పిలిచినా నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్ర‌మే ప‌నిగా పెట్టుకున్న కొంద‌రి కోసం ఇక్క‌డికి రాలేదు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 10:29 AM GMT
ట్రోలింగ్ రేంజ్ ఎంతైనా..అమ్మ‌డి ముందు జుజూబీ!
X

బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి పరిచయం అవసరం లేదు. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగు యువతకు మైండ్ బ్లాక్ చేసింది. అలాగే రాఘవ లారెన్స్ 'కాంచన 3'లోనూ నటించిన సంగతి తెలిసిందే. 'ఫియర్ ఫ్యాక్టర్: కాట్రోన్ కే ఖిలాడి' టీవీ షోలో కూడా నటించింది. హిందీలో బిగ్ బాస్ 15 పార్టిసిపేషన్ తో మరింత ప్రజాదరణ పొందింది. ఈ బ్యూటీ వేడెక్కించే ప్ర‌తిభ గురించి ప్రత్యేకించి చెప్పనవరం లేదు. యువ‌త అటెన్ష‌న్ కోసం ఫోటోషూట్లలోనూ అద్భుతంగా ఎలా కనిపించాలో తెలుసు.

తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియో షేర్ చేసి ట్రోల‌ర్స్ ఆహారంగా మారిపోయింది. ఇది చూసిన నెటి జ‌న్స్ అన్నీ ర‌కాల కామెంట్లో నిక్కీని ఓ ఆట ఆడుకున్నారు. కొంద‌రైతే ఏకంగా పోర్న్ స్టార్ తోనే పోల్చారు. తాజాగా ఆ స‌న్నివేశాన్ని ఉద్దేశించి అమ్మ‌డు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ' ట్రోలింగ్ నాకేం కొత్త కాదు. మీరు ఎలా పిలిచినా నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్ర‌మే ప‌నిగా పెట్టుకున్న కొంద‌రి కోసం ఇక్క‌డికి రాలేదు. ఎంత స్పందిస్తే అంత‌కంటే ఎక్కువ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే అలాంటి వాటిని అస్స‌లు ప‌ట్టించుకోను. నాపై ట్రోల్ చేసి ఏదో ఒక రోజు వాళ్ల‌కే విసుగొచ్చి వ‌దిలేస్తారు. వాళ్ల కామెంట్ల‌కు రెస్పాండ్ అవ్వాల్సిన ప‌నిలేదు' అంది. నిజ‌మే ఇలాంటి ట్రోలింగ్ లు నిక్కీ తంబోలికి కొత్తేం కాదు. బిగ్ బాస్ లో పాల్గొన్న‌ప్పుడు ఇంత‌కు మించిన ట్రోలింగ్ ఎక్స్ పీరియ‌న్స్ చూసింది. అన‌కొండ మందు వాన‌పాము ఎంత అన్నట్లు? ఇలాంటి ట్రోలింగ్ లు ఎన్నో చూసి ఈ స్థాయికి వ‌చ్చింది.

నిక్కీ తంబోలీకి హిందీ సహా సౌత్ లోనూ ఫ్యాన్సున్నారు. పలువురు నిర్మాతలు తనకు హాట్ కంటెంట్ ఉన్న స్క్రిప్టుల్ని వినిపించారని తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తెలుగు అవ‌కాశాలో కోసం ఎదురు చూస్తోంది. ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా! సిద్ద‌మేనంటూ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఛాన్స్ ఇచ్చి చూడండి..నా స‌త్తా ఏంటో చూపిస్తానంటూ చెప్ప‌క‌నే చెబుతుంది.