నిశా ఎక్కించేలా నిక్కి అందాలు..!
సిల్వర్ స్క్రీన్ పై మెరవాలంటే ముందు తమని తాము అందంగా ప్రెజంట్ చేసుకోవాలన్నది ఫస్ట్ రూల్
By: Tupaki Desk | 4 Jun 2024 12:25 PM GMTసిల్వర్ స్క్రీన్ పై మెరవాలంటే ముందు తమని తాము అందంగా ప్రెజంట్ చేసుకోవాలన్నది ఫస్ట్ రూల్. తెర మీద అభినయంతో మెప్పించే వారి కన్నా అందంగా కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలిచే వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందంగా ఉండి అభినయంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. అందుకే ఈమధ్య యువ తారలంతా కూడా గ్లామర్ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా రెచ్చిపోతున్నారు. సినిమాల్లో ఇచ్చిన పాత్రల్లో చేయాల్సిన స్కిన్ షో చేయడం కామన్ అవ్వగా ఫోటో షూట్స్ లో దానికి మించి గ్లామర్ షోతో అదరగొట్టేస్తున్నారు.
ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పించడంలో ముందున్న వారిలో అందాల భామ నిక్కి తంబోలి కూడా ఉంటుంది. మ్యూజిక్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన అమ్మడు తెలుగులో 3 సినిమాల్లో నటించింది. చీకటిగదిలో చితక్కొట్టుడు అనే సినిమాలో అమ్మడి గ్లామర్ షో ఆడియన్స్ ని అలరించింది. ఆ తర్వాత తిప్పరా మీసంలో నటించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. బిగ్ బాస్ సీజన్ 14 లో కంటెస్టెంట్ గా వెళ్లి రన్నరప్ గా నిలిచింది నిక్కి తంబోలి.
సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో ఎలాగైనా ఆడియన్స్ మనసులో రిజిస్టర్ అవ్వాలని అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరో క్రేజీ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేసింది. వెరైటీ అవుట్ ఫిట్ తో డిజైనర్ వేర్ లో అందాలు గుమ్మరిస్తూ అదరగొట్టేసింది నిక్కి తంబోలి. గ్లామర్ షో చేయడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా అని అనిపించేలా సత్తా చాటుతుంది నిక్కి.
నిక్కి తంబోలి లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఆడియన్స్ అంతా క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అందాలతో నిశా ఎక్కిస్తున్న నక్కి అంటూ చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. గ్లామర్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కటౌట్ అయినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి నిక్కి తంబోలి చేస్తున్న ఈ స్కిన్ షోకి ఆమెకు అవకాశాల రూపంలో ఛాన్సులు వచ్చేలా చేస్తాయా అన్నది చూడాలి. నిక్కి రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తే సోషల్ మీడియా అంతా సలాం కొట్టాల్సిందే అనేలా అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ వైరల్ గా మారాయి.