Begin typing your search above and press return to search.

ఈగ విలన్.. హనుమాన్ నిర్మాత

ఈ మధ్య టాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా వేరే భాషల వైపు అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:29 PM GMT
ఈగ విలన్.. హనుమాన్ నిర్మాత
X

ఈ మధ్య టాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా వేరే భాషల వైపు అడుగులు వేస్తున్నారు. దిల్ రాజు ఆల్రెడీ తమిళంలో, హిందీలో సినిమాలు తీశారు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు మలయాళంలో సినిమా తీశారు. పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సైతం తమిళంలో ఓ మూవీ చేశారు. ఈ బాటలోనే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి సైతం వేరే భాషలోకి అడుగు పెడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిరంజన్ రెడ్డి.. కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన కిచ్చా సుదీప్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. దీని గురించి ఈ రోజే హింట్ ఇచ్చారు. పేకముక్కల్లో కింగ్‌ను చూపిస్తూ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్‌కు రెడీగా ఉండండి అని ప్రైమ్ షో సంస్థ ఓ పోస్టర్ వదిలింది.


కింగ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున గుర్తుకొస్తాడు కానీ.. నిరంజన్ రెడ్డి సినిమా తీయబోయేది కిచ్చా సుదీప్‌తో అని సమాచారం. సుదీప్‌కు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమానే కావచ్చు. పెద్ద బడ్జెట్టే పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ‘హనుమాన్’తో నిరంజన్ రెడ్డి పేరు మార్మోగింది. ఆ చిత్రంతో భారీ లాభాలే అందుకున్నాడు నిరంజన్ రెడ్డి. కానీ ఆ తర్వాత ఆయనకు కలిసి రావట్లేదు. తమ బేనర్లో తెరకెక్కిన ‘డార్లింగ్’తో నష్టాలు ఎదుర్కొన్నారు. ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం వరల్డ్ వైడ్ రైట్స్ పెద్ద మొత్తానికి తీసుకుని రిలీజ్ చేస్తే అది చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినా సరే నిరంజన్ రెడ్డి దూకుడేమీ తగ్గట్లేదు. వరుసగా సినిమాలు తీస్తున్నారు. వచ్చే ఏడాది ఈ బేనర్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.