Begin typing your search above and press return to search.

వన్నె తగ్గని సుకుమారి.. కాజల్ సోదరి

తాజాగా ఆమె ఓ అదిరిపోయే ఫొటోషూట్​తో తన అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 1:14 PM GMT
వన్నె తగ్గని సుకుమారి.. కాజల్  సోదరి
X

హీరోయిన్ కాజల్‌ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పలు సినిమాల్లో హీరోయిన్​గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి నిషా అగర్వాల్‌. 2013లో కరణ్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయినా ఆమె.. ఇన్‌స్టా వేదికగా తరచూ తన అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌పై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నారు. రకరకాల ఫొటోషూట్లను పోస్ట్​ చేస్టుంటారు.


ఆమెకు హీరోయిన్​గా భారీ అవకాశాలు, అలాగే స్టార్​ ఇమేజ్​ రానప్పటికీ.. తెలుగు ఆడియెన్స్​ హృదయాల్లో మాత్రం చోటు సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ఓ అదిరిపోయే ఫొటోషూట్​తో తన అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు. ఇందులో ఆమె పూల డిజైన్ కలిగిన సిల్క్ ఎంబ్రాయిడరీ లెహంగా ధరించి చూపరులను ఆకట్టుకున్నారు.


ఆమె లూజ్​ హెయిర్​, చేతికి మందపాటి గోల్డ్​ బ్యాంగిల్, క్యూట్ స్మైల్​ అదనపు ఆకర్షణను ఇచ్చింది. ఆమె మేకప్​ కూడా ఎక్స్​ట్రార్డనరీగా ఉంది. ఫ్లాలెస్​ స్కిన్​, వెల్ డిఫైన్డ్​ కళతో, సాఫ్ట్​ టచ్​తో తన ఔట్​ఫిట్​ తగట్టు ఎంతో నేచురల్​గా ఉంది. ఆమె ఫ్యాషన్​ సెన్స్, డిస్టిన్​క్టివ్​ స్టైల్​​ ఎంతో బాగుంది.

కాగా, కాజల్‌ అగర్వాల్‌ చెల్లిగా నిషా అగర్వాల్‌ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'ఏమైంది ఈవేళ' చిత్రంతో టాలీవుడ్​ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నారా రోహిత్​ 'సోలో', ఆది సాయికుమార్​ 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 2013 డిసెంబర్‌లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త కరణ్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు.

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మళ్ళీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈమె గ్లామర్ ఫోటో షూట్స్​లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రొడక్షన్ హౌస్​లకు కూడా పంపిస్తున్నట్లు వినికిడి.