కళ్లు భైర్లు కమ్మేలా అంబానీ గౌను ధర..!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలను అంబానీ కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించడం చర్చనీయాంశమైంది
By: Tupaki Desk | 17 Jun 2024 11:31 AM GMTఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలను అంబానీ కుటుంబం అంగరంగ వైభవంగా నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా ముగిసాయి. జామ్ నగర్, ఇటలీ క్రూయిజ్ షిప్ లలో రెండు విలాసవంతమైన ప్రీవెడ్డింగులు జరగ్గా..ఇవి అత్యంత ఖరీదైన ప్రీ-వెడ్డింగ్ వేడుకలుగా రికార్డులకెక్కాయి. ఈ వేడుకలకు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ సహా పలు రంగాల నుంచి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పాప్ స్టార్లు, సింగర్లు హాజరై అహూతులను రంజింపజేసారు. సుమారు 2000 కోట్లు ఈ ప్రీవెడ్డింగుల కోసం అంబానీలు ఖర్చు చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రెండవ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌ను ఇటలీలో విహారయాత్రలో నిర్వహించారు. దీనికోసం అంబానీలు వందల కోట్లు ఖర్చు చేసారని గుసగుస ఉంది. ఈ వేడుకల కోసం అంబానీ ఫ్యామిలీ లేడీస్ అత్యంత ఖరీదైన విలాసవంతమైన డిజైనర్ దుస్తులను ధరించారు. ఆభరణాల విలువ కోట్లలో ఉందని అంచనా. దీనికి సంబంధించిన చాలా ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
అనంత్ తల్లి నీతా అంబానీ ఒక ఈవెంట్ కోసం ఆస్కార్ డి లా రెంటా రూపొందించిన అద్భుతమైన కస్టమ్ మేడ్ గౌను ధరించారు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ బాలీవుడ్ ఉమెన్ క్లోసెట్ ప్రకారం.. సీక్విన్స్‌తో అలంకరించిన డిజైనర్ గౌను ధర సుమారు 15.5 లక్షలు
($18,457) ఉంటుందని అంచనా వేసారు. ఈ గౌన్ పర్పుల్ బ్రింజాల్ కలర్ లో తళతళా మెరిసిపోయింది. ఈ సరికొత్త గౌన్ వల్ల నీతాజీ లుక్ మారిపోయింది. వయసు సగానికి సగం తగ్గిపోయిందని అహూతులు కమెంట్ చేసారు. వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ వైఫ్ నీతా అంబానీ ఎంచుకున్న వస్త్రధారణ ఆభరణాలు అంబానీ కుటుంబ స్థాయిని ఎటివేట్ చేసాయి. చక్కదనంతో పాటు ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించాయి.
అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహం 12 జూలై 2024న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఇది ఒక అత్యంత భారీ వేడుకగా ఉంటుందని కథనాలొస్తున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ఈ వివాహం ఎంత ఘనంగా జరిగిందో నేరుగా ప్రత్యక్షంగా వీక్షించే వీలుంది.