Begin typing your search above and press return to search.

నీతా అంబానీ ధ‌రించిన హారం ధ‌ర ఎంతంటే?

రిల‌యన్స్ పౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ హోదా లో..అనంత్ అంబానీ త‌ల్లిగా నీతా అంబానీ వేడుక‌లో ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచారు

By:  Tupaki Desk   |   4 March 2024 9:39 AM GMT
నీతా అంబానీ ధ‌రించిన హారం ధ‌ర ఎంతంటే?
X

అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చెంట్ ప్రీవెడ్డింగ్ వేడుక‌లో ఎంత మంది అతిధులున్నా? నీతా అంబానీకి సాటెవ్వ‌రు అనిపించింది ఒక్క‌రూ లేరు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. నీతా అంబానీ ముస్తాబైన విధానం.. అలంక‌ర‌ణ ప్ర‌తీది బాలీవుడ్ హీరోయిన్ మించి ఉన్నారు అన‌డంలో అతి లేదు. మూడు రోజుల వేడుక అంతా త‌న‌దా? అన్నంత హంగామా నీతా చేసారాక్క‌డ‌. అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ భార్య‌గా.. రిల‌యన్స్ పౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ హోదా లో..అనంత్ అంబానీ త‌ల్లిగా నీతా అంబానీ వేడుక‌లో ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచారు.

బేసిక్ గానే నీతా అంబానీ గొప్ప డాన్స‌ర్ . అలాంటి డాన్స‌ర్ చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ త‌న‌యుడి వేడుక‌లో స్టెప్ అందుకోవ‌డం అన్న‌ది వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వీట‌న్నింటిని మించి అప‌ర‌కుబేరుడు భార్య హోదాలో నీతా అంబానీ త‌మ ఐడెంటిటీని న‌క్లెస్ రూపంలో చాట‌డం ప్ర‌త్యేకమ‌నే చెప్పాలి. త‌మ హోదాకి ఏమాత్రం త‌గ్గ‌కుండా ఖ‌రీదైన డైమండ్ నెక్లెస్ ధ‌రించి? ఏకంగా ప్ర‌పంచ‌మే ఆమె కోసం మాట్లాడుకునేలా చేసారు.

ఖ‌రీదైన కాంచీపురం డైమండ్ నెక్లెస్ లో నీతా నెక్ అంతా ధ‌గ‌ధ‌గ‌లాడిపోయింది అంటే అతిశ‌యోక్తి కాదు. బోర్డ‌ర్ పై క్లాసిక్ ట్రెడీష‌న్ జ‌ర్దోసీ వ‌ర్క్..బ్లౌజ్ స్లీవ్ ల‌పై ప్ర‌త్యేక‌మైన గోటా వ‌ర్క్ అంద‌మైన మ్యాక‌ప్ తో మ‌రింత అందంగా ముస్తాబైన విధానం ప్ర‌తీది నీతాని ఎంతో అందంగా తీర్చి దిద్దాయి. అక్క‌డ ఎంత‌మంది అంద‌గంత్తెలు ఉన్నా నీతా అందం ముందు ఎంత‌? అనిపించారు. వ‌చ్చిన అధితులు స‌హా మ‌హిళ‌లు అంతా నీతా ధ‌రించిన అంద‌మైన నెక్లెస్ పైనే అంద‌రి క‌ళ్లు ప‌డ్డాయి.

ఆ డైమండ్ న‌క్లెస్ ఎంత అందంగా ఉంది? ధ‌ర ఎంతో? అంటూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రి దీని ధ‌ర ఎంతం టే? 300 కోట్ల నుంచి 400 కోట్ల మ‌ధ్య‌లో ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మ‌ణిహారాన్ని నీతా ప్రీ వెడ్డింగ్ కోసం ప్ర‌త్యేకంగా తయారు చేయించిన‌ట్లు తెలుస్తోంది. కాక్ టెయిల్ నైట్ ఈవెంట్ లో వైన్ క‌ల‌ర్ క‌స్ట‌మ్ మేడ్ గౌను..క్లాసిక్ ప్రెంచ్ ట్విస్ట్ బ‌న్ లో అదిరిపోయే లుక్ లో క‌నిపించారు. మ‌రి పెళ్లి ఖ‌ర్చులే 1000 కోట్లు అవుతుంటే? నీతా మెడ‌లో ఆ మాత్రం లుక్ లేక‌పోతే ఎలా.