Begin typing your search above and press return to search.

క‌న్యాదానం స్పీచ్‌తో కంట త‌డి పెట్టించిన నీతా అంబానీ

నీతా అంబానీ 'కన్యాదాన్' ఆచారం గురించి వివరిస్తుండగా.. ఆమె భర్త ముఖేష్ అంబానీ సహా పలువురు అతిథులు భావోద్వేగానికి గురయ్యారు

By:  Tupaki Desk   |   17 July 2024 11:14 AM GMT
క‌న్యాదానం స్పీచ్‌తో కంట త‌డి పెట్టించిన నీతా అంబానీ
X

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక జంట‌ వివాహ వేడుకలో కన్యాదాన్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో దీనిని అన్ని చర్యలలో గొప్పది! అని వ్యాఖ్యానించిన నీతాజీ ఏ తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఇవ్వలేరని అన్నారు. ఏళ్లుగా కూతురుతో కుటుంబం పంచుకునే అనుబంధం అనురాగం.. త‌ల్లిదండ్రుల‌ హృదయంలోని భాగం ఆప్యాయత, ఆనందం, జ్ఞాపకాలతో ఎలా బ్రేక్ అవుతుంది?.. అందుకే వారిని అప్పగించలేము.. వారు శాశ్వతంగా త‌ల్లిదండ్రుల‌తోనే ఉంటారు. కుమార్తె త‌మ‌తో ఉండవలసిన ఆస్తి కాదు.. బదిలీ అవుతుంది.. కానీ ఆమె సంతోషం, ప్రేమ, కాంతికి మూలం దొరికిన‌ప్పుడు.. ఆమె (కుమార్తె) ఇప్పుడు తన కొత్త కుటుంబంతో కూడా అదే అనుబంధం పంచుకుంటుంది``అని నీతా అంబానీ అన్నారు.

నీతా అంబానీ `కన్యాదాన్` ఆచారం గురించి వివరిస్తుండగా.. ఆమె భర్త ముఖేష్ అంబానీ సహా పలువురు అతిథులు భావోద్వేగానికి గురయ్యారు. ``భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు మహిళలకు అత్యంత గౌరవం ఇస్తాయి. మన గ్రంధాల ప్ర‌కారం... మనకు ఎక్కడ ఆడపిల్లలు ఉంటారో, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. కూతుళ్లకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ. మన కుమార్తెలు ఇళ్లను స్వర్గంగా భావిస్తారు అని నీతా అంబానీ త‌న స్పీచ్ లో తెలిపారు. ఒక భారతీయ వివాహం వరుడు - వధువు మధ్య మరియు వారి నిజమైన కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వం పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించి, అతడి కుటుంబానికి వారి విలువైన కుమార్తెను అప్పగించడం `కన్యాదాన్` నిజమైన సాంస్కృతిక ప్రాముఖ్యత! అని నీతా అంబానీ అన్నారు.

నేనే ఒక కూతురిగా, ఒక కూతురికి తల్లిగా, అత్తగా కూడా ఇది చెబుతున్నాను.. ఏ తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఎప్పటికీ ఇవ్వలేరని నాకు తెలుసు! అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. ``కుమార్తెలు జీవితానికి అతిపెద్ద ఆశీర్వాదాలు.. గొప్ప ఆనందాలు. వారు లక్ష్మీ దేవి రూపం. వారు పుట్టినప్పటి నుండి మన ఇంటికి జీవితాలకు సమృద్ధి ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తారు. వారు మన ఆత్మలలోని స్వచ్ఛమైన భాగాలు, మన ఉనికితో ముడిపడి ఉన్నారు! అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు.

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్ జూలై 12న జరిగింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సామాజికవేత్తలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారులు, సినీప్ర‌ముఖులు, పారిశ్రామిక వేత్త‌లు ఈ పెళ్లికి విచ్చేసి న‌వ‌దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. అమెరిక‌న్ రియాలిటీ క్వీన్స్ కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు.