శ్రద్ధా కపూర్‌తో పోలిక.. నీతాన్షీ ఏమందంటే
లాపతా లేడీస్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ నీతాన్షీ గోయల్. ఆ సినిమాలో పూల్ కుమారీ పాత్రలో నీతాన్షీ ఒదిగిపోయిన తీరు అందరినీ మెప్పించింది.
By: Tupaki Desk | 15 March 2025 9:00 PM ISTలాపతా లేడీస్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ నీతాన్షీ గోయల్. ఆ సినిమాలో పూల్ కుమారీ పాత్రలో నీతాన్షీ ఒదిగిపోయిన తీరు అందరినీ మెప్పించింది. లాపాతా లేడీస్ లో అందరికంటే గుర్తుండి పోయే పాత్ర అదే. అందుకే ఇప్పటికీ నీతాన్షీ ఎక్కడైనా కనిపిస్తే అందరూ పూల్ అనే పిలుస్తుంటారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. లాపాతా లేడీస్ మూవీ తన లైఫ్ ను ఎంతగానో మార్చేసిందని, ఆ మూవీ రిలీజయ్యాక తాను ఎక్కడికెళ్లినా అందరూ పూల్ అనే పిలుస్తున్నారని, దానికి తనకెంతోసంతోషంగా ఉందని, ఆ సినిమా తర్వాత తనకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిందని నీతాన్షీ గోయల్ పేర్కొంది.
రీసెంట్ గా తాను షేర్ చేసిన ఫోటోలకు కొంతమంది నెటిజన్ల నుంచి చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చాయని, కొన్ని ఫోటోల్లో తాను శ్రద్ధా కపూర్ లా ఉన్నానని కామెంట్ చేశారని నీతాన్షీ తెలిపింది. అయితే ఆ పోలిక తనను ఏ మాత్రం ఇబ్బంది పెట్టడం లేదని, ఇంకా చెప్పాలంటే ఆ కామెంట్స్ చూసి తానెంతో మురిసిపోయానని నీతాన్షీ తెలిపింది.
తనను శ్రద్ధా కపూర్ తో పోల్చడాన్ని కాంప్లిమెంట్ గా తీసుకుంటానని, శ్రద్ధాకు తాను ఎంతో పెద్ద ఫ్యాన్ ని అని, ఆమె లానే తాను కూడా కెరీర్లో రాణించాలనుకుంటున్నట్టు చెప్తోన్న నీతాన్షీ.. శ్రద్ధా డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమని, ఆమె సన్ సాథియా సాంగ్ తన ఇంట్లో ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుందని, ఆ స్టెప్పులు కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు నీతాన్షీ తెలిపింది.
నీతాన్షీ గోయల్ యూకే టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా నీతాన్షీ ఆ ఇంటర్వ్యూలో స్పందించింది. అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా లాంటి టాప్ సెలబ్రిటీస్ ఉన్న లిస్ట్ లో స్థానం దక్కించుకోవడం నిజంగా తన అదృష్టమని, ఈ విషయంలో తనకెంతో గర్వంగా ఉందని నీతాన్షి చెప్పింది.