Begin typing your search above and press return to search.

సందీప్ వంగా కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు

అయితే ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, దంగ‌ల్ ఫేం.. ప్ర‌స్తుతం రామాయ‌ణం చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నితీష్ తివారీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. సందీప్ వంగా కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తునిచ్చారు.

By:  Tupaki Desk   |   24 March 2025 10:47 AM IST
సందీప్ వంగా కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు
X

సందీప్ వంగా తెర‌కెక్కించిన 'యానిమల్' చిత్రం పాన్ ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించినా కానీ, ఈ సినిమాని బ‌హిరంగంగా ప్రశంసించేందుకు ఏ బాలీవుడ్ దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు ముందుకు రాలేదు. సందీప్ వంగాపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన వారే కానీ, ఒక తెలుగు ద‌ర్శ‌కుడికి అండ‌గా నిల‌వాల‌నే సానుకూల ఆలోచ‌న ఎవ‌రికీ లేదు. అనురాగ్ క‌శ్య‌ప్ తొలుత సందీప్ వంగాను త‌ప్పుగా అర్థం చేసుకున్నాన‌ని, ఆ త‌రవాత అత‌డితో గంట‌ల కొద్దీ మాట్లాడాన‌ని అన్నారు. వంగాపై తన అభిప్రాయం మారిపోయింద‌ని తెలిపారు.

క్వీన్ కంగ‌న ర‌నౌత్ మాత్ర‌మే ఒక సౌత్ ఫిలింమేక‌ర్ అయిన‌ సందీప్ వంగా ఘ‌న‌త‌ను ప్ర‌శంసించారు. ఇత‌ర ప్ర‌ముఖులెవ‌రూ అత‌డి ప్ర‌తిభ గురించి కానీ, మేకింగ్ స్టైల్ గురించి కానీ మాట్లాడ‌లేదు. యానిమ‌ల్ లో నెగెటివ్ పాయింట్స్ ని మాత్ర‌మే వారు హైలైట్ చేసారు. అయితే ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, దంగ‌ల్ ఫేం.. ప్ర‌స్తుతం రామాయ‌ణం చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నితీష్ తివారీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. సందీప్ వంగా కు ప‌రోక్షంగా మ‌ద్ధ‌తునిచ్చారు.

రణబీర్ కపూర్ తో రామాయ‌ణం లాంటి భారీ సినిమాకి ప‌ని చేస్తున్న నితీష్ తివారీ.. తాను తదుపరి దర్శకత్వం వహించాలనుకుంటున్న ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. అభిమానులు 'రామాయణం' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో గ్రేట్ డైరెక్ట‌ర్ నితీష్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ సీక్వెల్ అయిన `మీర్జాపూర్ 4` కంటే `యానిమల్ పార్క్`కి దర్శకత్వం వహించడానికి అధిక ప్రాధాన్య‌నిస్తాన‌ని ఒక రియాలిటీ షోలో వ్యాఖ్యానించాడు. కోమల్ నహ్తా గేమ్ ఛేంజ‌ర్స్ ఎపిసోడ్ లో నితీస్‌ తివారీ రాపిడ్-ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన ప్ర‌శ్న‌కు నిరభ్యంత‌రంగా యానిమ‌ల్ పార్క్ నే ఎంపిక చేసుకున్నాడు. దీని అర్థం.. సందీప్ వంగా 'యానిమ‌ల్' అసాధార‌ణ విజ‌యం బాలీవుడ్ లోని దిగ్గ‌జ ద‌ర్శ‌కుల మైండ్ పై స్ప‌ష్ఠంగా ప్ర‌భావం చూపింద‌ని భావించాలి. కొన్ని కోణాల్లో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నా కానీ, క‌మ‌ర్షియ‌ల్ గా బెస్ట్ కంటెంట్ ని సందీప్ బాలీవుడ్ కి అందించాడ‌ని అక్క‌డి ప్ర‌ముఖులు అంగీక‌రించాలి.

నితీష్ ఈ చాటింగ్ సెష‌న్ లో ఇంకా చాలా విష‌యాలు మాట్లాడారు. తాను సాధారణంగా సాహసించని శైలితో వ‌చ్చిన‌వి ఇవి రెండూ. కానీ 'యానిమ‌ల్ పార్క్'పై మ‌రింత ఎగ్జ‌యిట్ చేస్తుంద‌ని అన్నారు. మ‌రింత టెంప్టింగ్ ఎలిమెంట్ యానిమ‌ల్ సీక్వెల్‌ లో ఉంటుంద‌ని అన్నారు. న‌టీన‌టులు గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ఆస్కారం ఉన్న స్క్రిప్ట్ యానిమ‌ల్ పార్క్. ద‌ర్శ‌కుడికి మంచి పేరొస్తుంద‌ని కూడా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ప‌రోక్షంగా అభిప్రాయ‌ప‌డ్డారు.

సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. మొద‌టి భాగం కంటే మ‌రింత రంజుగా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తీర్చిదిద్దేందుకు సందీప్ వంగా స్క్రిప్టు ప‌నుల్లో ఉన్నారు. మ‌రోవైపు నితీష్ తివారీ ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ ప్ర‌ధాన పాత్ర‌లో రామాయ‌ణం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. రణబీర్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు, సాయి పల్లవి మా సీతగా నటిస్తుండగా, యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సన్నీ డియోల్, లారా దత్తా, రవి దూబే, అరుణ్ గోవిల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా 2024లో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. రామాయణం రెండు భాగాలు వరుసగా దీపావళి 2026 .. దీపావళి 2027లో విడుదల అవుతాయని తెలిపారు.